న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 27: తెలంగాణ బిజెపికి చెందిన 8 మంది లోక్‌సభ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ సహా పలువురు బిజెపి ప్రతినిధులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం… కీలకమైన రాష్ట్ర సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు అవకాశాలపై చర్చించింది.