ప్రజాగ్రహానికి ఆజ్యం పోస్తున్న ఇథనాల్!

venugopal nఇది రాస్తున్న సమయానికి నిర్మల్ జిల్లాలో నిర్మల్ – భైంసా జాతీయ రహదారి మీద దిలావర్ పూర్ లో రైతుల, ముఖ్యంగా మహిళల రాస్తారోకో ఆందోళన అనంతర పరిణామాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమయిన ఆందోళన బుధవారం ఉదయానికి కూడా కొనసాగింది. వేలాది మంది దిలావర్ పూర్, గుండంపల్లి, సమందర్ పల్లి, రత్నపూర్ కాండ్లీ, చర్లపల్లి గ్రామాల ప్రజలు ఎంతో కాలంగా చేస్తున్న ఆందోళన ఒక కీలక దశకు చేరగా, ప్రభుత్వం అలవాటయిన పద్ధతిలోనే భారీగా పోలీసులను మోహరించి, బలప్రయోగం ద్వారానే స్పందించదలచుకున్నట్టు కనబడుతున్నది. తమ ప్రాంతంలో ప్రభుత్వం అనుమతించిన ఇథనాల్ ఫాక్టరీని రద్దు చేయాలనే మౌలిక డిమాండ్ మీద ఈ ప్రజాందోళన సాగుతున్నది. దాదాపు ఏడాదిగా సాగుతున్న ఈ ఆందోళనకు ప్రజాస్వామిక పరిష్కారం సాధించడానికి ఏ ప్రయత్నమూ చేయని ప్రభుత్వం, ఇప్పుడు కూడా పోలీసు నిర్బంధం ప్రయోగించి దాన్ని అణచివేయడం మీదనే దృష్టి పెట్టింది. ఈ ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నందుకు ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం ద్వారా రైతులను మరింతగా రెచ్చగొట్టింది.
భారత ప్రభుత్వం ధాన్యాలను అంతకంతకూ ఎక్కువగా ఆహారం వైపు నుంచి పెట్రోల్ లో కలిపే ఇథనాల్ వైపు మళ్లిస్తున్నది. ఈ పని కోసం దేశమంతా విరివిగా ఇథనాల్ ఉత్పత్తి కర్మాగారాలు ఏర్పాటు చేయాలనుకున్నది. ఇథనాల్ కర్మాగారాల ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేశారు. తప్పనిసరిగా ఉండవలసిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేశారు. ఎన్నో రాయితీలు ప్రకటించారు. బియ్యం కారుచౌకగా ఇవ్వడానికీ, వడ్డీ లేని అప్పులు ఇవ్వడానికీ విధానాలు తయారు చేశారు.
ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు, ఇథనాల్ ఫాక్టరీ అనుమతిని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తరఫున కలెక్టర్ వచ్చి ప్రకటించాలని ఆందోళనకారులు కోరుతుండగా, కలెక్టర్ అక్కడికి రావడానికే సిద్ధపడలేదు. ఆందోళన గురించి తెలిసి అక్కడికి చేరిన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జోక్యాన్ని ఆందోళనకారులు అంగీకరించలేదు. కలెక్టర్ రావలసిందే అన్నారు. ఆర్ డి వో అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆందోళనకారులు ఆమె కారును దిగ్బంధనం చేశారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యస్థితి క్షీణించడంతో ఆమెను ఎస్పీ కారులో హాస్పిటల్ కు  పంపించారు. అక్కడ మిగిలిపోయిన ఆర్ డి వో కారుకు ఆందోళనకారులలో అత్యుత్సాహపరులో, లేక ఆందోళనకారుల మీద బట్టకాల్చి వేయదలచుకున్నవారో నిప్పంటించారు.
image.png
జాతీయ రహదారి మీద రాస్తా రోకో చేసి ట్రాఫిక్ కు ఆటంకం కలిగించడం, ఆర్ డి వో విధినిర్వహణను అడ్డుకోవడం, నిర్బంధించడం, కారుకు నిప్పంటించడం అనే నేరారోపణలతో 23 మంది రైతుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.  మరికొంత మంది మీద కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఇన్ని జరుగుతున్నాయి గాని అసలు సమస్య చర్చకు రావడం లేదు. రైతుల ప్రజాస్వామిక ఆందోళన మీద మొదట నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం ఇప్పుడు కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నది. అసలు సమస్య ఏమిటి? ఇథనాల్ ఫాక్టరీలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతుల ఆందోళనాక్రమంలో దిలావర్ పూర్ ప్రారంభమూ కాదు, ముగింపూ కాబోదు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచే తెలంగాణలో అనేక చోట్ల ఇథనాల్ ఫాక్టరీల ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన సాగించారు. కాంగ్రెస్ పాలనలో ఆందోళనలు వాటికి కొనసాగింపే.
పిఎంకె డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మద్యం ఉత్పత్తి కంపెనీ గుండంపల్లి శివారులో ఇథనాల్ ఫాక్టరీ నిర్మాణం కోసం 2023 నుంచి ప్రయత్నిస్తున్నది. తమ పంట భూములను ఆక్రమించి ప్రవేశిస్తున్న ఈ ఫాక్టరీ వల్ల ఎటువంటి కాలుష్యం సంభవిస్తుందో, మొత్తంగా ఇథనాల్ పరిశ్రమ ప్రజలకు, పర్యావరణానికి ఎటువంటి సమస్యలు సృష్టిస్తుందో తెలుసుకున్న ప్రజలు దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అని ఉద్యమ వేదికను నిర్మించుకున్నారు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించాయి. ఏడాదిగా అనేక రూపాలలో ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిజానికి తెలంగాణలో ఇథనాల్ వ్యతిరేక పోరాటాలలో అది మొదటిదేమీ కాదు. గత ప్రభుత్వ కాలంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ కంపెనీ 2022 లోనే ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ వ్యర్థజలాలను పక్కనే ఉన్న మన్నెవాగులో వదిలేయడంతో చేపలు చనిపోయాయి, వాగులో నీళ్లు తాగి జింకలు చనిపోయాయి. వాగు నీటిలో దిగినవారికి చర్మవ్యాధులు వచ్చాయి. గ్రామాలలో దుర్వాసన వ్యాపించింది. చివరికి ఇతర గ్రామాల కూలీలు ఇథనాల్ ఫాక్టరీ గ్రామాలకు వచ్చి పనులు చేయడానికి నిరాకరించారు. ఆ పరిస్థితిలో చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో విస్తృతమైన పోరాటం జరిగింది. ఘర్షణలు జరిగాయి. యాజమాన్యం గ్రామస్తులపై చేసిన దాడిలో ఒక రైతు మరణించారు.
అంటే గత టిఆర్ఎస్/బిఆర్ఎస్ ప్రభుత్వమైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇథనాల్ ఫాక్టరీ విషయంలో ఒకే పద్ధతిలో ప్రవర్తిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు దిలావర్ పూర్ ప్రజల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు నటిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానం వల్లనే ఈ ఇథనాల్ ఫాక్టరీలు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి.
అందులో భాగమే తెలంగాణలో రానున్న 30 కొత్త ఇథనాల్ ఫాక్టరీలు. వీటి నుంచి ఉద్యోగ కల్పనా పెద్దగా ఉండదు గాని, అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. మొట్టమొదట, ఆహార ధాన్యాలను ఇతోధికంగా ఇథనాల్ వైపు మళ్లించడం ద్వారా దేశంలో ఆహార భద్రత దెబ్బ తింటుంది. ఇథనాల్ కు అవసరమైన ఆహార ధాన్యాలన్నీ విపరీతంగా నీటిని ఆశించేవి. కనుక వాటి ఉత్పత్తి పెరిగినకొద్దీ నీటి వినియోగంలో అసమానతలు పెరుగుతాయి. అలాగే ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే కనీసం నాలుగు లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ఆయా కంపెనీల సామర్థ్యాన్ని, సాంకేతిక విధానాన్ని బట్టి నీటి వినియోగం ఎనిమిది లీటర్ల వరకు పెరగవచ్చు. అంటే ఇథనాల్ కర్మాగారాలు వచ్చే గ్రామాలలో, పరిసర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న సాగునీటి, తాగునీటి ఎద్దడి మరింత పెరుగుతుంది.
నరేంద్ర మోదీ  ప్రభుత్వం  2018లో ప్రకటించిన నేషనల్ బయోఫ్యుయెల్ పాలసీ ప్రకారం రూపొందిన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కింద 2030 నాటికి దేశంలో పెట్రోల్ వినియోగంలో 20 శాతం ఇథనాల్ కలపాలని నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని ఇంకా ముందుకు జరిపి 2025-26  నాటికే సాధించాలన్నారు. చక్కెర కర్మాగారాలలో ఉప ఉత్పత్తి మొలాసిస్ మొలాసెస్ ద్వారా 2020 నాటికి తయారవుతున్న 426 కోట్ల లీటర్ల ఇథనాల్ ను 2025 నాటికి 760 కోట్ల లీటర్లకు, బియ్యం, నూకలు, మక్కజొన్న, జొన్న వంటి ధాన్యాలను పులియబెట్టడం ద్వారా, ధాన్యం ద్వారా తయారవుతున్న 258 కోట్ల లీటర్ల ఇథనాల్ ను 740 కోట్ల లీటర్లకు పెంచాలని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఈ అంకెలు చూస్తే మొలాసెస్ ద్వారా ఉత్పత్తయ్యే ఇథనాల్ లో 1.7 రెట్ల పెరుగుదల ఉండగా, ధాన్యం ద్వారా ఉత్పత్తయ్యే ఇథనాల్ లో 2.8 రెట్ల పెరుగుదల ఉంది. అంటే భారత ప్రభుత్వం ధాన్యాలను అంతకంతకూ ఎక్కువగా ఆహారం వైపు నుంచి పెట్రోల్ లో కలిపే ఇథనాల్ వైపు మళ్లిస్తున్నది. ఈ పని కోసం దేశమంతా విరివిగా ఇథనాల్ ఉత్పత్తి కర్మాగారాలు ఏర్పాటు చేయాలనుకున్నది. ఇథనాల్ కర్మాగారాల ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేశారు. తప్పనిసరిగా ఉండవలసిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేశారు. ఎన్నో రాయితీలు ప్రకటించారు. బియ్యం కారుచౌకగా ఇవ్వడానికీ, వడ్డీ లేని అప్పులు ఇవ్వడానికీ విధానాలు తయారు చేశారు.
image.png
ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ అనే రంగు, వాసన లేని ద్రవం మద్యంతో సమానం, మద్యం తయారీలో ఉపయోగపడే రసాయనం. దాన్ని పెట్రోల్ లో కలిపితే ఇంధనంగా కూడా పనిచేస్తుంది. చౌకగా తయారవుతుంది గనుక పెట్రోల్ లో 20 శాతం కలిపితే ఆ మేరకు పెట్రోల్ ధరలు తగ్గేలా చూడవచ్చునని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.  అందులో భాగమే తెలంగాణలో రానున్న 30 కొత్త ఇథనాల్ ఫాక్టరీలు. వీటి నుంచి ఉద్యోగ కల్పనా పెద్దగా ఉండదు గాని, అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. మొట్టమొదట, ఆహార ధాన్యాలను ఇతోధికంగా ఇథనాల్ వైపు మళ్లించడం ద్వారా దేశంలో ఆహార భద్రత దెబ్బ తింటుంది. ఇథనాల్ కు అవసరమైన ఆహార ధాన్యాలన్నీ విపరీతంగా నీటిని ఆశించేవి. కనుక వాటి ఉత్పత్తి పెరిగినకొద్దీ నీటి వినియోగంలో అసమానతలు పెరుగుతాయి. అలాగే ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే కనీసం నాలుగు లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ఆయా కంపెనీల సామర్థ్యాన్ని, సాంకేతిక విధానాన్ని బట్టి నీటి వినియోగం ఎనిమిది లీటర్ల వరకు పెరగవచ్చు. అంటే ఇథనాల్ కర్మాగారాలు వచ్చే గ్రామాలలో, పరిసర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న సాగునీటి, తాగునీటి ఎద్దడి మరింత పెరుగుతుంది. ఇథనాల్ కర్మాగారాలు తమ నీటి అవసరాల కోసం బోర్ బావులు తవ్వడం ప్రారంభిస్తే చుట్టూరా ఉన్న భూగర్భ జలాలు అడుగంటిపోతాయి.
చుట్టూ రైతుల పొలాలలో బోర్లు, బావులు ఎండిపోతాయి. ధాన్యాన్ని పులియబెట్టే ప్రక్రియ వల్ల ఇథనాల్ తయారీలో విపరీతంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. దాన్ని సేకరించి ఇతరంగా వినియోగించాలని నిబంధనాలున్నాయి గాని వినియోగించే వాయు పరిమాణం కన్నా, వెలువడే వాయు పరిమాణం చాలా ఎక్కువ. ఉదాహరణకు దిలావర్ పూర్ ఇథనాల్ కర్మాగారంలో ప్రతి రోజూ 238 టన్నుల కారన్ డై ఆక్సైడ్ వెలువడుతుందని అంచనా ఉండగా, అందులో 110 టన్నుల వినియోగానికి మాత్రమే ఇతర కంపెనీలతో ఒప్పందాలున్నాయి. మిగతా వాయువు అక్కడి గాలిలో కలిసి కాలుష్యానికి కారణమవుతుంది. ఇథనాల్ కర్మాగారాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఏ స్థాయిలోనూ షరతులు పెట్టడం లేదు. కనుక నిర్వాసితులకు, బాధితులకు ఉద్యోగాలు దక్కుతాయనే హామీ కూడా లేదు. ఇంత చేసీ ఈ ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయనే హామీ లేదు. పెట్రోలు వాడకం తగ్గుతుందనే హామీ లేదు. ఈ క్రమంలో ఇథనాల్ ధరలు కూడా పెరిగిపోయి, మొత్తం పెట్రోల్ ధరలో వ్యత్యాసం ఉండే అవకాశం కూడా లేకపోవచ్చు. ఇథనాల్ ఉత్పత్తి వ్యయం, దాని అమ్మకం ధర వంటి ఆర్థికాంశాలు పరిశీలించినా, ఇథనాల్ కర్మాగారాలు ఎక్కువకాలం మనుగడ సాగించే పరిస్థితి లేదు.
ఈ అన్ని కారణాలూ కలిపి చూస్తే ఇథనాల్ పరిశ్రమ పేరు మీద కొందరు వ్యాపారవేత్తలకు రియల్ ఎస్టేట్ భూమి దొరకడం కన్న మరేమీ జరగదు. కొందరు రైతులు తమ భూమి పోగొట్టుకుని నిర్వాసితులు అవుతారు. ఆ పరిశ్రమ నడిచిన కొద్ది సంవత్సరాలైనా అది తన పరిసర ప్రాంతాలను కాలుష్యమయం చేస్తుంది. పరిసర ప్రాంతాల ప్రజలను అనారోగ్య బాధితులను చేస్తుంది. ఈ పరిశ్రమ వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండేట్టు కనబడడం లేదు. ఇప్పటివరకూ తెలంగాణలో ఇథనాల్ పరిశ్రమ యజమానులు, వ్యాపారవేత్తలు అన్ని పాలకపార్టీల్లోనూ ఉన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం నాయకులు, వ్యాపారవేత్తలు కలిసికట్టుగా సాగిస్తున్న వ్యాపారం ఇది. ఇథనాల్ అనేది పెట్రోల్ కలిసి, ధర తగ్గించే ఇంధనం అవునో కాదో తెలియదు గాని, ప్రజాగ్రహాన్ని మరింత మండించే దందహ్యమాన ఆజ్యం అని మాత్రం అటు చిత్తనూరు, ఇటు దిలావర్ పూర్ చూపెడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page