‘‘ఇక చాలు..’’

‘‘‌కానీ ఈతరం బాలికలు వీటన్నిటిని ఎదురించాలని రాజ్యంగా హక్కులకు అనుగుణంగా నూతన సామాజిక నియమాలను ఎర్పరచాలని బాలికల పట్ల వివక్షత ఇంకే మాత్రం అనివార్యమైనవి కావని రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్‌, ‌గద్వాల్‌ ‌మరియు హైదరాబాద్‌ ‌జిల్లాలలోని బాలికా సంఘాల సభ్యులు నిరూపించారు. ఈ స్థితిని మార్చవచ్చు అని బాలికలు చేస్తున్న పోరాటంతో పాటు బాలల హక్కుల పరిరక్షణ వేదికలు, గ్రామ పంచాయతీలు, మహిళా గ్రూపులు, యువజన కార్యకర్తలు బాల్యవివాహాలను ఎదిరించి, వాటిని ఆపారు. బస్టాప్‌ ‌లు  , ఇతర బహిరంగ ప్రదేశాలలో ఆడపిల్లల్ని వేధించే ఆకతాయిలను మందలించారు. అదుపు చేశారు. ఇలాంటి వారిలో చాలా మంది బాలికలకు అండగా, స్త్రీ పురుషుల సమానత్వం కోసం పోరాడటానికి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. బాలికలకు గౌరవాన్ని సంతరించి పెట్టి, వారి విద్యాభివృద్ధి కోసం జరిగే ఉద్యమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, పురుషులు, పోలీసులు భాగస్వాములయ్యారు. .’’

(వివక్షత ‘ఇక చాలని’ సమానత్వ సాధనకై పోరాడుతున్న బాలికలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు)

మార్చి 8 అంతర్జాతీయ మ హిళా దినోత్స వాన్ని ప్రపంచం అంతటా కోలా హలంతో జరుపు కుంటారు. ప్రభు త్వాలు సైతం చా లా అధికారిక కా ర్యక్రమాలు రూ పొందిస్తారు. ఉప న్యాసాలు జోరు గానే సాగు తాయి. కానీ స్థానికంగా బాలికల ఉన్నత  విద్య పట్ల కానీ వారి భద్రత విషయంలో కానీ శ్రద్ద వహించరు. ఇంకా ఒక అడుగు ముందుకేసి  బాల్య  వివాహాల విషయంలో చట్టాన్ని అతిక్రమించినా పర్వాలేదనే సంకేతాలు ఇస్తుంటారు.  స్థానిక జిల్లా  బాల రక్షణ అధికారులను బెదిరించి బాల్య వివాహాలను అడ్డుకోవద్దని చెప్పిన సంఘటనలు చాలానే. బాల్య వివాహాలకు హాజరైన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. బాలికలకు హక్కులున్నాయని, సమాజం లో వివక్షత ఉందనే విషయాన్ని పట్టించుకోక పోగా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాలల వైపు కాకుండా ఉల్లంఘించిన వారి వైపు ఉండడడం గమనిస్తాము. మన ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు ఆడపిల్లల కోసం రూపొందించే  పథకాలు..చేసే  చట్టాలు అన్నీ కూడా ఈ మానసిక స్థితి నుండి వొస్తున్నవే. బాలికలకు జరిగే  వివక్షత ,అవమానాలు మన సమాజం వారి వ్యక్తి గత గౌరవ భంగాన్ని సాధార ణమైన దిగా ను, సామాజిక నియమం గాను ఆమో దిస్తారు.

కానీ ఈతరం బాలికలు వీటన్ని టిని ఎదురిం చాలని రాజ్యంగా హక్కులకు అనుగుణంగా నూతన సామాజిక నియమాలను ఎర్పర చాలని బాలికల పట్ల వివక్షత ఇంకే మాత్రం అని వార్యమైనవి కావని రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్‌, ‌గద్వాల్‌ ‌మరియు హైదరాబాద్‌ ‌జిల్లాలలోని బాలికా సంఘాల సభ్యులు నిరూపించారు. ఈ స్థితిని మార్చ వచ్చు అని బాలికలు చేస్తున్న పోరాటంతో పాటు బాలల హక్కుల పరిరక్షణ వేదికలు, గ్రామ పంచాయతీలు, మహిళా గ్రూపులు, యువజన కార్యకర్తలు బాల్యవివాహాలను ఎదిరించి, వాటిని ఆపారు. బస్టాప్‌లు, ఇతర బహిరంగ ప్రదే శాలలో ఆడపిల్లల్ని వేధించే ఆకతాయిలను మందలించారు. అదుపు చేశారు. ఇలాంటి వారిలో చాలా మంది బాలికలకు అండగా, స్త్రీ పురుషుల సమానత్వం కోసం పోరాడటానికి ఉద్య మంలో భాగస్వాము లయ్యారు. బాలికలకు గౌర వాన్ని సంతరి ంచి పెట్టి, వారి విద్యా భివృద్ధి కోసం జరిగే ఉద్యమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యా యులు, పురుషులు, పోలీసులు భాగస్వాము లయ్యారు.

సమాజంలో ఈమార్పు కోసమే బాలి కలు ఎదురుచూస్తున్నారు. వాళ్ళ గురించి చర్చ జరుగుతోందని, వారి అభ్యు న్నతి గురించి సమాజం ఆలోచిస్తోందని తెలిశాక, వారు సమాజంలో తమ స్థానం కోసం, సమా నత్వం కోసం పోరాడటం ప్రారంభించారు. బాలకార్మికత కు వ్యతిరే కంగా గళం విప్పి, బడికి వెడతామని పట్టుబ డుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక పెద్దలను ఎదిరించి, బాల్య వివా హాలకు వ్యతిరేకంగా తమ హక్కులను చాటుకుంటున్నారు. వివిధ గ్రామాలలో స్వాతంత్య్ర  దినోత్సవం, రిపబ్లిక్‌ ‌డే లాంటి జాతీయ పండుగలలో జెండాలను ఎగిరే శారు. మామూలుగా జెండా పం డుగలు పురుష యువజన సంఘాలు చేసు కునే అనువాయితిని మార్చి వేశారు. వాస్తవానికి, పితృస్వామ్యం నుంచి, లింగ వివక్ష నుంచి. బైటపడాలన్న వారి పట్టుదల, అధికార వ్యవస్థలకు వారు ధీటుగా నిలబడిన తీరు చాలా స్ఫూర్తిదాయకం.

ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న ఆడపిల్లలు అందరూ కలిసి ‘ఇక చాలు’ అనే  సంస్థను స్థాపించి గ్రామ గ్రామన సభలు సమా వేశాలు నిర్వహించుకుంటారు. ప్రతి కమిటీలో 10 నుండి 15 మంది ఆడపిల్లలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆడ పిల్లల పట్ల వివక్షతను ఎదురుకోవడానికి తగు శిక్షణలు పొంది అధికారులతో గ్రామ సర్పంచులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కార మార్గాల వైపు ప్రయాణం చేస్తు న్నారు. ఈ సంస్థ ప్రకటించిన రాజిలేని సూత్రాలు పౌరులకు రాజ్యంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ఉన్నాయి.


ఆడపిల్లల హక్కుల సాధనకు రాజీలేని సూత్రాలు:

పిల్లలందరూ 18 సంవత్సరాల వరకు పూర్తి కాలం విద్యా సంస్థలలోనే ఉండాలని, విద్య ను అభ్యసించడంలో సామర్ధ్యాలు అందు కోవడంలో బాలికలు బాలురకు సమాన అవకాశాలు ఉండాలని, ఒకటవ తరగతి నుండే జెండర్‌ ‌సమానత్వంపై చర్చ మరియు పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని, బాలికల స్వతంత్రతను నియంత్రించే ఏ వాదనలనైనా తిరస్కరించాలని, జెండర్‌, ‌కులం, మతం, అంగవైకల్యం లాంటి వివక్షలు లేకుండా అన్నీ సామాజిక స్థలాలు బాల బాలికాకలకు సమానంగా అందు బాటిలో ఉండాలని, లింగ బేధం ఆధారంగా యువజన సం ఘాలు ఉండరాదని, 18 సంవత్సరాలు నిండకుండా ఏ అమ్మాయికి పెళ్లి చేయ రాదని ఒక వేల జరిగినచో పెళ్లిళ్లను రద్దు చేస్తూ  బాల్య వివాహ నిషేధ చట్టం’2006 ను సవరించాలని రాజీలేని సూత్రాలతో ఈ సంఘ సభ్యులు పని చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆడపిల్లల చదు వులకు ప్రాధాన్య తనివ్వాలని.. పెళ్లిళ్లకు కాదని కళ్యాణలక్ష్మీ వద్దు చదువుల తల్లి ముద్దు అని గట్టిగా నినదిస్తున్నారు ఈ అమ్మాయిలు. అలాగే గ్రామల నుండి చదువుకు కదిలిన తొలితరం ఆడపిల్లలకు ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించడంలో రవాణా సంస్థ నిర్లక్ష్యం వహిస్తే ధర్నాలు చేసి ఒత్తిడి పెంచి ఆర్టీసీ బస్సులను తమ గ్రామాలకు కాలేజీ స్కూల్‌ ‌సమయాలలో నడిచే విధంగా చూస్తారు.

పాఠశాలలో ఆడపిల్లల పట్ల వివక్షత ఈ రూపంలో నైనా సహించకుండా వెంటనే ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. అది స్కూల్‌ ‌లో టీచర్లు ఆడపిల్లలకు చెప్పే పను లకు మగ పిల్లలకు చెప్పే పనులలో వివక్షత ను బహిరంగంగా  టీచర్లతో చర్చిస్తారు. అలాగే పాఠ్యపుస్తకాలలో ఉన్న బొమ్మలు లింగ వివక్షతతో కూడినవిగా ఉంటే విద్యా శాఖ దృష్టికి తీసుకెళతారు. ఉదాహారణకు టెక్సట్  ‌బుక్స్ ‌రచయితలు అత్యధిక శాతం పురుషుల తో తయారు చేయడం సరికాదని సామాన్య అవకాశాలు ఆ స్థాయిలో కూడా కల్పించాలని ఉపాధ్యా యులతో చర్చిస్తారు. అంతేకాకుండా మహిళా టీచర్లకు అప్పగించే బాధ్యతలలో తేడాలు కనిపిస్తే కూడా జెండర్‌ ‌కమిటీలలో చర్చించుకుంటారు.
మొత్తంగా బాలికలు ఇళ్ళల్లో, సమాజంలో మరియు పాఠశాలలో తాము ఎదుర్కునే వివక్షత అనుభవాలను పంచుకు నేందుకు మరియు కుటుంబసభ్యులా ఉపాధ్యాయుల కమ్యూనిటీ దృక్పదాలలో లింగ సమానత్వం పై మార్పులు ఎలా తీసుకురావచ్చో ఆలోచన చేసి సురక్షిత మైన వేదిక నే ‘‘ఇక చాలు’’ వేదిక. ఈ వేదికలో ఉన్న బాలికలు పరస్పర శక్తి పొందుతూ వారు ఇంతకు ముందెన్నడూ చూడని బహిరంగ ప్రదేశాలలోకి ప్రవే శించడం ప్రారంభించారు. తద్వారా వారి చలన స్వేచ్చను ప్రకటించుకుంటున్నారు.

పదవ తరగతి పూర్తి చేసిన బాలికలు ఉన్నత విద్య మరియు ఇతర కోర్సులను మ్యాపింగ్‌ ‌చేసి వారు ఏ కోర్సులు చేసే అవకా శము ందో ఎంపిక చేసుకోవడానికి ఒకరికొకరు సహకరించుకుంటారు. అలాగే ఈ సమూ హం పాఠశాలలు మానేసిన బాలికలు గుర్తించి మళ్ళీ పాఠశాలలో చేరేందుకు ప్రోత్సాహిస్తారు. క్రమంగా ఈ సమూ హంలోని బాలికలు లైంగిక వేధింపులు, బాల్య వివాహం, పాఠశాల సమస్యలు మొదలగు అంశాలను గ్రామ పంచాయితీలు మండల అధికారులకు తెలియచేసి వాటి పరిష్కారానికి వారి మద్దతు పొందాటానికి ధైర్యం సంపాదించారు. హింస, లైంగిక వేధింపుల సమస్యలను పోలీసు అధికా రులతో జరిపిన చర్చలు జరపడానికి నాయ కత్వం వహించారు. ‘ఇక చాలు’ అనే సమూహం చేస్తున్న కార్య క్రమాలను తెలుసుసుకుని వివధ ప్రాంతాల  ఆడపిల్లలు ఆసక్తి కన పరచిన కారణంగా కొత్త మండలాలకు విస్తరించి ఇక చాలు సంస్థను ‘తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య’(••••)గా ఏర్పాటు చేసు కున్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశంలో బాలికల హక్కుల కు మద్దతు నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తూ చేసిన తీర్మానాలు అంతర్జాతీయ మ హిళా దినోత్సవం సందర్భంగా మరొక సారి గుర్తు చేయాలి.

విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులను కేటాయించాలని ముఖ్య మంత్రికి లేఖలు రాయడం పత్రికా సమా వేశాలు నిర్వహించడం, బాలికల వికాసం కోసం స్పష్టమైన విద్యా లక్ష్యాలు నిర్దేశించాలి తప్ప, చదువులు మధ్యలో ఆపివేయడాన్ని ప్రోత్స హించే కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను పమలు చేయవద్దని, కళ్యాణ లక్ష్మి పథకం బదులుగా ఉన్నత విద్యా అవకా శాలను మెరుగుపరచాలని, పిల్లలందరికీ ఉచిత రవాణ సౌకర్యాలు కల్పించాలని.. అవసరం ఉన్న టీచర్లను నియమించాలని, నిలిపివేసిన స్కాలర్షిప్స్ ‌వెంటనే అంది ంచా లని, ప్రభుత్వ డిగ్రీ కాలేజిలు అందుబాటులోకి తేవాలని, కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్‌ ‌విద్యకు అన్ని గ్రూపులు అందు బాటులోకి తేవాలని, పిల్లలకు కావలసిన కులం, ఆదాయం, ఆధార్‌, ‌పుట్టిన తేదిలాంటి సర్టిఫికెట్లు అన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి ఇచ్చే విధంగా చూడాలి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో పూర్వ ప్రాథమిక మరియు ఇంటర్మీడియట్‌ ‌కోర్సులు ఉండే విధంగా చూడాలి.

ఉన్నత విద్య, డిగ్రీ చదివే పిల్లలకు ప్రభుత్వం హాస్టల్‌ ‌వసతి కల్పించాలి, మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్‌ ‌వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు.చివరగా బాలికలకు అండగా నిలవడం లాంఛన ప్రాయం కాదని, దానికి బలమైన నిబద్ధత మరియు నైతికతతో కూడిన రాజ కీయ చర్య అవసరమని ప్రభుత్వాలు గుర్తిం చాల్సిన సమయం ఆసన్న మైంది. లింగ వివక్షను వ్యతిరేకిం చడం, సమా నత్వాన్ని  సమర్ధిం చడాన్ని అధికార సంబ ంధాల పరిష్కార ప్రక్రియలో భాగంగా చూడాలి. అందుకు గాను బాలికల హక్కు లకు విలువ నిచ్చి  వారికి అండగా నిలిచే వ్య వస్థలు, సంస్థలను ఏర్పాటు చేసిన నాడే సమానత్వం కోసం న్యాయం కోసం రాజ్యా ంగ హక్కుల కోసం నూతన సామాజిక నియ మాల మార్పు కోసం బాలికలు చేస్తున్న ఉద్య మానికి బాటలు వేసినట్లు అవుతుంది.

ఆర్‌.‌వెంకట్‌ ‌రెడ్డి
(జాతీయ కన్వీనర్‌,
ఎం.‌వి. ఫౌండేషన్‌)
venkatmvf@gmail.com
9949865516

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page