అడుగడుగున ఒక అబూఝ్‌ ‌మాడ్‌

సరిగ్గా వందేళ్ల కిందట ఆర్‌ ఎస్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ ఒకేసారి  ప్రయాణం ప్రారంభించాయి కదా, ఇప్పుడు వాళ్లెక్కడున్నారు, మీరెక్కడున్నారు? అని అడిగారు హరగోపాల్‌ ఈ ‌మధ్య ఒక సభలో. కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ ‌నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ, ఆయన తొంభయ్యో పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన సమావేశంలో కమ్యూనిస్టుల దుస్థితి గురించి చాలా మంది వక్తలు ఆవేదన చెందారు. ప్రతాపరెడ్డి కొత్తపుస్తకాలలో ఒకటి నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర. రచయిత దాని ముందుమాటలో కమ్యూనిస్టుల్లో చీలికల గురించి, మావోయిస్టుల అసాధ్యమైన కార్యాచరణ వల్ల జరుగుతున్న ప్రాణనష్టం గురించి చాలా బాధ పడ్డారు. అందరూ ఒక కుదురులోని వారే కదా, కలసి పనిచేయాలని కూడా ఆయన కోరుకున్నారు.

హరగోపాల్‌ ‌తెచ్చిన పోలిక కూడా మొత్తం కమ్యూనిస్టు  కుదురు దీనస్థితి గురించే. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలన పేరుతో జరుగుతున్న మారణకాండ, అనివార్యంగా అటువైపు దృష్టి మళ్లించవలసినంత తీవ్రంగా ఉన్నది. అయినా, ప్రధానస్రవంతి వార్తాస్రవంతి దానినొక సహజమైన, ప్రశ్నించలేని క్రమంగా కథనం చేస్తున్నది. అధికార స్వరానికే కాస్త ఉత్కంఠను జోడించి ప్రసరింపజేస్తున్నది. స్థానిక మీడియాలోని సాహసులు, హక్కుల సంఘాలు తప్ప మరెవరూ ఏకపక్ష మరణాల మీద అనుమానాలను వ్యక్తం చేయడంలేదు.  బస్తర్‌ ‌ప్రాంత సిపిఐ, జరుగుతున్న పరిణామాలలో సాధారణ ఆదివాసుల మరణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ లోను, ఎపిలోనూ కమ్యూనిస్టు పార్టీలు సభలు పెట్టి,  తక్షణం అణచివేత  ఆపరేషన్‌ ‌ను విరమిం చుకోవాలని కోరాయి.  ఒక తీవ్రమయిన స్థితి, ఐకమత్యాన్ని కాకపోయినా, సంఘీభావాన్ని సాధిస్తోంది.

నిజానికి అది సరిపోదు. భౌతికంగా అబూఝ్‌ ‌మాడ్‌ ‌లో జరుగుతున్నది, ఏకపక్షమే కావచ్చును కానీ,  అది ఒక వాస్తవ యుద్ధం. దానికి  స్పంది ంచడం, అది సర్వవ్యాప్తమవుతుందని భయ పడడం  విస్తృత సమాజంలో జరగదు. అది ఆ రెండు పక్షాలకు సంబంధించినది అనుకుంటారు, లేదా, అంతటి ఉద్రిక్త, భయానక స్థితి పట్టణ, మైదాన గ్రామీణ సమాజాలకు వ్యాపిం చదు అని భరోసా మీద ఉం టారు. కానీ, కమ్యూనిస్టులు కానీ, ఉనికికి ప్రమాదం వచ్చిందని గ్రహిం చవలసిన సకల శక్తులు కానీ, గుర్తించవలసింది ఏమిటంటే, దేశంలో యుద్ధరంగం ఒకటే లేదు. దేశవ్యాప్తంగా అనేకానేక ప్రతీకాత్మక రణరం గాలు ఏర్పడి ఉన్నాయి.  వీటిలో రకరకాల స్థాయిలలో ఏకపక్షమో, ప్రతిఘ టనాపూర్వకమో పోరా టాలు సాగుతున్నాయి. ఇవి  భౌతిక, వాస్తవ పోరాటా లుగా మారబోవన్న నమ్మకమేమీ లేదు.  ఇవి సాయుధ, మిలిటెంట్‌ ‌పోరాటవాదులకు పరిమి తమైనవి కావు,  ప్రతి భిన్న ఆలోచనకు, ఆచర ణకు ప్రాతినిధ్యం వహించే సమస్త రాజకీయ, సామా జిక, సాంస్కృతిక శ్రేణులూ ఈ రణరం గాలలో అనివార్య భాగస్వాములు కాకతప్పడం లేదు. అసమాన యుద్ధంలో అణగారిపోకా తప్పడం లేదు.

అయితే, వేర్వేరు రంగాలలో వేర్వేరు యుద్ధాలు  జరుగుతున్నాయి కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం ఈ అన్ని క్షేత్రాలలోనూ ఏకశక్తిగా ఒక సమన్వయంతో విరుచుకుపడుతున్నది. దాని మీద పోరాడుతున్నవాళ్లు విడిపోయి ఉన్నారు. ఐక్యత ఆవశ్యకతను ఎవరైనా గుర్తిస్తున్నారో లేదో కూడా తెలియదు.  కమ్యూనిస్టులు ఏకం కాలేరని వెక్కిరించేవాళ్లు, ఇంత కష్టకాలంలోనూ  హర్యానాలో, దిల్లీలో కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలు ఎందుకు కలసినడవక   ఓటమి కోరి తెచ్చుకున్నారని అడగాలి కదా? ఈ అనైక్యత ఇట్లాగే కొనసాగతే,  ఒక దేశం, ఒక ఎన్నిక, ఒకపార్టీ, ఒకే నేత, ఈ క్రమం విజయవంతంగా పూర్తవుతుంది. ఇక ఆపై,  దేశంలో జనతన సర్కార్‌లు కాదు కదా, ఆప్‌ ‌సర్కార్‌ ‌లు కూడా సాధ్యం కావు. మార్కస్, ‌లెనిన్‌, ‌మావో ఆలోచనలు కాదు కదా, అంబేడ్కర్‌, ‌గాంధీ వాదాలకు కూడా అడ్రస్‌ ఉం‌డదు. ప్రాంతీయ పార్టీలకు సామంతం కూడా అవకాశం ఉండదు, ప్రాయోపవేశమే గతి.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ ‌సైద్ధాంతికులు గోల్వాల్కర్‌ ‌తన ఆలోచనాగుచ్ఛం ‘ పాంచజన్యం’ లో జాతిశత్రువులెవరో నిర్ధారించారు. దేశానికి అంతర్గత ప్రమాదాల కింద ముస్లిములు, క్రైస్తవుల తరువాత కమ్యూనిస్టులనే ఆయన  చెప్పారు. మైనారిటీల రక్షణల గురించి, లౌకికవాదం ఆవశ్యకత గురించి ‘బయటి’ నుంచి మాట్లాడుతూ వచ్చిన రాజ్యాంగ బద్ధ కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రమాదం తమదాకా వచ్చిందని గుర్తించారు. ఇప్పుడిక గొంతు పెగిలించుకోక తప్పదు. కానీ, ఏమి చేయాలన్నది, ఏమి చేయగలమన్నది వాళ్లకు తెలియదు. ఫాసిస్టుప్రమాదం గురించో, మతతత్వం గురించి వాళ్లు మాట్లాడు తున్న ప్పుడు ఆత్మవిశ్వాసం పెద్దగా  ధ్వనించడం లేదు. వ్యక్తిగత, అనధికార సంభాషణల్లో ఆత్మవిమర్శ బాగానే వ్యక్తం అవుతోంది కానీ, బిజెపి నుంచి ఎత్తుగడలు నేర్చుకో వాల న్నట్టుగా వాళ్ల పరిష్కార ఆలోచనలు ఉంటు న్నాయి.

వాళ్ల లాగా అభినయిస్తే, తాము వాళ్లు అయిపోలేరు కదా? అరవింద్‌ ‌కేజ్రీవాల్‌  ‌హనుమాన్‌ ‌చాలీసా చదివినా యోగితో పోటీప డగలడా? ఆ విషయమే కావలసి వాళ్లకు ఒరిజినల్‌ ఉం‌డగా, డూప్లికేట్‌ ‌లు ఎందుకు?  ఎన్ని గుళ్లకు వెళ్లి ఎన్ని బొట్లు పెట్టుకున్నా, రాహుల్‌గాంధీకి  యాంటీ హిందూ బిరుదు పోతుందా? ఆయన్నే అర్బన్‌ ‌నక్సల్‌ అన్నవాళ్లు సిపిఎం ను, సిపిఐను వదులుతారా?  విశ్వాసాలుంటే  గుళ్లకు వెళ్లకూడదని, బోనాలు ఎత్తుకోగూ డదనీ కాదు.  అదే మంచి ఎత్తుగడ అయితే ప్రయత్నించకూడదనీ కాదు. భావదారిద్య్రం నుంచి ప్రవర్తిస్తేనే సమస్య. నూతన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కానీ, దానికి దీటుగా స్పందించడంలో కానీ బలహీనత ఎందుకు ఏర్పడిందని ఒకసారి సమీక్షిం చుకో వాలి. ఎక్కడో దారి తప్పింది. లేదా, సృజనాత్మకత క్షీణించింది. బలవంతుడి ఆధిక్యాన్ని అంగీకరించి, నిస్సహాయులుగా మిగిలిపోయే ప్రలోభం పెరిగింది. ఆ గుర్తింపు ఉండాలి.

తమ ఉనికికి ఏర్పడిన ప్రమాదాన్ని గుర్తించ కుండా,  పాత విశ్లేషణలను వల్లెవేయడం వల్ల ఉపయోగం ఏమిటి? బాహ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దుస్సాహస విధానాలు అనుసరించిన  కారణంగా మావో యిస్టులు అంతరించిపోతున్నారని ఇప్పటికీ చెప్పడంలో సందర్భం ఏముంది? కావచ్చు, మావో యిస్టులు  తమ ప్రయాణాన్ని సమీక్షిం చుకోవ లసిన సమయం వచ్చి ఉండొచ్చు.  ఎట్లా ఈ అష్ట దిగ్బంధంలోకి చిక్కుకు పోయిందీ, దేశవ్యాప్తంగా పౌరసమాజం తమ విషయంలో  ఎందుకు అచేతనం అయిందీ వారు విశ్లేషించుకోవలసిందే. కానీ, కమ్యూనిస్టు పార్టీలతో సహా ఏ ప్రతి పక్షపార్టీలకూ మిలిటెంట్‌ ‌మార్గీయులవి తప్పుడు వ్యూహాలని, తప్పుడు విధానాలని అనడానికి నైతిక హక్కు మాత్రం  లేదు.  ఎందుకంటే, సాధు మార్గాలు, మృదుమార్గాలు అనుసరించి వాళ్లు సాధించిందేమీ లేదు, తమను తాము క్షీణిం పజేసుకుని,  ప్రమాదాన్ని మరింత బలశాలిగా మార్చడం తప్ప! ఎందుకంటే, మీరు మాత్రం మర్యాదైన, సరిఅయిన రాజకీయాలు నడుపుతూ ఏ మాత్రం బతికి బట్టగట్టారు? మావోయిస్టుల వేదిక అబూఝ్‌ ‌మాడ్‌ అనుకుంటే, అక్కడ వాళ్లు నిర్మూలనను ఎదుర్కొంటున్నారు.

‌మొన్న సాధారణ ఎన్నికల్లో మెరుగుపరుచుకున్న బలం కూడా పదినెలల్లో ఆవిరిచేసుకుంది. దేశంలో ఊచకోత జరగనిది ఎక్కడ?  భౌగోళికంగానే కాదు, భావ పరంగా, వివిధ రాజ్యాంగ సంస్థల పరంగా, భావస్వేచ్ఛల పరంగా ఎన్నో వృక్షాల కూల్చివేత జరుగుతోంది. మనుషుల మనస్సులను మతావేశాలతోను, మత మిళిత జాతీయావేశాలతోనూ జయిస్తున్నారు,  ‘ఇతరుల’ ప్రమాదం ఉన్నదన్న భయం కలిగించి ఉన్మాదం పెంచుతున్నారు. మధ్యతరగతిని అనైతిక ఆశలతో లోబరుచుకుంటున్నారు, నిచ్చెనమెట్ల సమాజంలోని అంతరాలతో క్రీడలాడి వివిధ కులశ్రేణులను దారిలోకి పెడుతున్నారు, తమ తంత్రాలకు లొంగని ఉలిపికట్టెలను ఊచలు లెక్కబెట్టిస్తున్నారు.  ఒక్కటనేమిటి, అడుగడుగున ఒక రణస్థలం!

పార్లమెంటరీ కమ్యూనిస్టుల రంగస్థలాలు బెంగాల్‌, ‌త్రిపురలో ఏం జరిగింది. అక్కడా నిర్మూలనే జరిగింది కదా? తీవ్రత, నిర్బంధం రీత్యా పోల్చలేనివి అయిన ప్పటికీ, ఎన్నికలలో పాల్గొనే కమ్యూ నిస్టులకు జరిగిన జరుగుతున్ననష్టం వారి ఉనికిని తుడి చిపెట్టేదే.  ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి  రెండు  తెలుగు రాష్ట్రాలలో ఏమిటి? వాళ్ల ఉద్యమపు నాదులన్నీ ఊచకోతకు గురవుతు న్నాయి. కార్యకర్తలు దొరకని, సభలకు జనసమీ కరణ జరపలేని పరిస్థితి. బిజెపి పూర్తి మెజారిటీ వచ్చిన కాలంలోనే ఆప్‌ ‌కూడా అధికారానికి వచ్చింది. అవినీతి రహిత, స్వచ్ఛ పాలనను అందిస్తానని కనీసం మధ్యతరగతిలో ఆశలు రేపింది. మొన్న దిల్లీ  ఓటమి, ఆప్‌ ‌మీదనే కాదు, ప్రత్యామ్నాయపు ఆశలను కూడా ఓడించింది. అసాధారణ చారిత్రక చమత్కారం వల్ల, సాను కూల రాజకీయ  శక్తిగా పౌరసమాజం గుర్తించవలసి వచ్చిన కాంగ్రెస్‌ ‌గతి ఏమిటి? మొన్న సాధారణ ఎన్నికల్లో మెరుగుపరుచుకున్న బలం కూడా పదినెలల్లో ఆవిరి చేసుకుంది. దేశంలో ఊచకోత జరగనిది ఎక్కడ?  భౌగోళి కంగానే కాదు, భావ పరంగా, వివిధ రాజ్యాంగ సంస్థల పరంగా, భావస్వేచ్ఛల పరంగా ఎన్నో వృక్షాల కూల్చివేత జరుగుతోంది. మనుషుల మనస్సులను మతా వేశాల తోను, మత మిళిత జాతీయా వేశాలతోనూ జయిస్తున్నారు.

కమ్యూనిస్టు పార్టీయే కాదు, అంతకు  నలభై ఏండ్ల ముందు పుట్టిన  జాతీయ కాంగ్రెస్‌ ‌కూడా తమ ప్రయాణం గురించి చర్చించుకోవాలి. నలభైఏండ్లనాటి తెలుగుదేశం, పాతికేళ్లనాటి బిఆర్‌ఎస్‌ ‌కూడా తమ భవిష్యత్‌ ‌చిత్రపటాన్ని దర్శించుకోవాలి. ఇప్పుడు సర్పయాగం నడుస్తున్నది, నాగులకే కాదు, వారి రక్షకులకు, సహబాధితులకు కూడా రక్షణ ఉండదు.

‘ఇతరుల’ ప్రమాదం ఉన్నదన్న భయం కలిగించి ఉన్మాదం పెంచుతున్నారు. మధ్యతరగతిని అనైతిక ఆశలతో లోబరుచుకుంటున్నారు, నిచ్చెనమెట్ల సమా జంలోని అంతరాలతో క్రీడలాడి వివిధ కుల శ్రేణులను దారిలోకి పెడుతున్నారు, తమ తంత్రాలకు లొంగని ఉలిపికట్టెలను ఊచలు లెక్కబెట్టిస్తున్నారు.  ఒక్కటనేమిటి, అడుగడుగున ఒక రణస్థలం! అయితే, వేర్వేరు రంగాలలో వేర్వేరు యుద్ధాలు  జరుగుతున్నాయి కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం ఈ అన్ని క్షేత్రాలలోనూ ఏకశక్తిగా ఒక సమన్వయంతో విరుచుకుపడుతున్నది. దాని మీద పోరాడుతున్నవాళ్లు విడిపోయి ఉన్నారు. ఐక్యత ఆవశ్యకతను ఎవరైనా గుర్తిస్తున్నారో లేదో కూడా తెలియదు.  కమ్యూనిస్టులు ఏకం కాలేరని వెక్కిరించేవాళ్లు, ఇంత కష్టకాలంలోనూ  హర్యా నాలో, దిల్లీలో కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలు ఎందుకు కలసినడవక ఓటమి కోరి తెచ్చుకున్నారని అడగాలి కదా? ఈ అనైక్యత ఇట్లాగే కొనసాగతే,  ఒక దేశం, ఒక ఎన్నిక, ఒకపార్టీ, ఒకే నేత, ఈ క్రమం విజయవంతంగా పూర్తవుతుంది. ఇక ఆపై,  దేశంలో జనతన సర్కార్‌లు కాదు కదా, ఆప్‌ ‌సర్కార్‌ ‌లు కూడా సాధ్యం కావు.

మార్కస్, ‌లెనిన్‌, ‌మావో ఆలోచనలు కాదు కదా, అంబేడ్కర్‌, ‌గాంధీ వాదాలకు కూడా అడ్రస్‌ ఉం‌డదు. ప్రాంతీయ పార్టీలకు సామంతం కూడా అవకాశం ఉండదు, ప్రాయోపవేశమే గతి.  కమ్యూనిస్టు పార్టీయే కాదు, అంతకు  నలభై ఏండ్ల ముందు పుట్టిన  జాతీయ కాంగ్రెస్‌ ‌కూడా తమ ప్రయాణం గురించి చర్చించుకోవాలి. నలభైఏండ్లనాటి తెలుగుదేశం, పాతికేళ్లనాటి బిఆర్‌ఎస్‌ ‌కూడా తమ భవిష్యత్‌ ‌చిత్రపటాన్ని దర్శిం చుకోవాలి. ఇప్పుడు సర్పయాగం నడు స్తున్నది, నాగులకే కాదు, వారి రక్షకులకు, సహబాధితులకు కూడా రక్షణ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page