పెద్ద ధన్వాడలో ధ్వనించిన ప్రజాగ్రహం!

telanganardham

గత బుధవారం, జూన్ 4న, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివార్లలో ఇథనాల్ కర్మాగారం నెలకొల్పడానికి గాయత్రీ రిన్యూవబుల్ ఫ్యుయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలను ఆ కర్మాగార కాలుష్యం వల్ల బాధితులు కానున్న గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కంపెనీ తీసుకువచ్చిన ప్రైవేటు సైన్యమూ, బౌన్సర్లూ ప్రజల మీద దాడిచేసి మరియమ్మ అనే మహిళ తల పగులగొట్టి, తీవ్రంగా గాయపరిచాక, ప్రజా నిరసన ఆగ్రహ ప్రకటనగా మారింది. కంపెనీ కార్యాలయంగా ఉపయోగించడానికి తెచ్చిన కంటెయినర్ ను కూలదోసి, నిప్పు పెట్టారు. కంపెనీకి చెందిన వాహనాలను తగులబెట్టారు.

ఆ దృశ్యాలు చూసినవారికి, అవి మాత్రమే చూసినవారికి, ప్రజలు హింసకూ, దౌర్జన్యానికీ పాల్పడినట్టు కనిపించవచ్చు. ప్రభుత్వానికీ పోలీసులకూ కూడా అలాగే కనిపించి, తీవ్రమైన కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ లో నలబై మంది పేర్లు రాసి, “ఇంకా ఇతరులు” అని మరింత మందిని ఇరికించడానికి అవకాశం మిగుల్చుకున్న పోలీసులు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్టు చేశారు. జనం సాక్షి పత్రికా సంపాదకుడు ఎంఎం రహమాన్ ను కూడా ఏ2 (అక్యూజ్డ్ 2, రెండో ముద్దాయి) గా చూపారు. ఇరవై తొమ్మిది మంది కోసం వెతుకుతున్నామని చెపుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలన్నిట్లోనూ పోలీసులు అధికారికంగానూ, అనధికారికంగానూ దాడులకు, సోదాలకు పాల్పడుతూ గ్రామస్తులను వేధిస్తున్నారు. ఆరోజు ధన్వాడలో ఏం జరిగిందో, ప్రజలకు అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందో వాస్తవాలు తెలుసుకోవడానికి, బాధిత ప్రజలను పరామర్శించడానికి వెళ్తున్న ప్రజా సంఘాల, పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఈ ఫాక్టరీ వల్ల కేవల పెద్ద ధన్వాడ మాత్రమే కాదు, చిన్న ధన్వాడ, నసనూరు, మన్ దొడ్డి, నౌరోజీ క్యాంపు, చిన్న తాండ్రపాడు, వేణీ సోంపూర్, తుమ్మిళ్ల, తనగల, పచరాల, కేశవరం, పెద్ద తాండ్రపాడు, రాజోలి వంటి కనీసం 12 పరిసర గ్రామాలు, చుట్టూ ఉన్న 30,40 గ్రామాలు జల, వాయు కాలుష్యాల బారిన పడతాయి. పెద్ద ధన్వాడ సుంకేకేశుల ఆనకట్టకు ఎగువన తుంగభద్ర ఒడ్డున ఉండడం వల్ల ఈ ఫాక్టరీ వాడే జలాల గురించి, వ్యర్థ కలుషిత జలాలను తుంగభద్రలో వదలడం గురించి కూడా అనుమానాలున్నాయి. ఒక లీటర్ ఎథనాల్ తయారీకి నాలుగు లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ ఫాక్టరీ రోజుకు రెండు లక్షల లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేస్తుందంటున్నారు. అంటే ఎనిమిది లక్షల లీటర్ల నీరు వాడుతుంది. అది పరిసర గ్రామాల వ్యవసాయం మీద ప్రతికూల ప్రభావం వేస్తుంది. ఒక లీటర్ ఎథనాల్ తయారీకి రెండుంబావు కిలోల బియ్యం కావాలి. అంటే రోజుకు నాలుగున్నర లక్షల కిలోల బియ్యం ఈ ఫాక్టరీ ఒక్కటే మింగేస్తుంది. రాష్ట్ర ఆహార భద్రత సంక్షోభంలో పడుతుంది. 

నిజానికి అక్కడ జరిగినది ఒక ప్రజాగ్రహ ప్రకటన. పాలకులు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాకూ ప్రజల జీవనానికీ, భద్రతకూ మధ్య భయానకమైన అగాథం ఉన్నప్పుడు, తీవ్రమైన ఘర్షణ ఉన్నప్పుడు సహజంగా పెల్లుబికే పరిణామమే. ఇప్పటికే నారాయణపేట జిల్లా చిత్తనూరు, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్, జగిత్యాల జిల్లా స్తంభంపల్లి, సూర్యాపేట జిల్లా రావిపహాడ్, సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ల వంటి అనేక చోట్ల ఇథనాల్ ఫాక్టరీల ప్రతిపాదనల మీద స్టానిక ప్రజలు ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేశారో, పెద్ద ధన్వాడలో కూడా అదే జరిగింది.

ఇథనాల్ ఫాక్టరీ, అసలు ఏదైనా ఒక ఫాక్టరీ, గ్రామీణ ప్రాంతంలో రావడమే “అభివృద్ధి” అనుకునేవాళ్లు ఆ “అభివృద్ధి” ప్రజల జీవితంలో ఎట్లా నిప్పులు పోస్తున్నదో అర్థం చేసుకోవాలి. ఇథనాల్ ఫాక్టరీని వ్యతిరేకించడానికి ప్రజలు తమ నిత్య జీవితంలో అనుభవించబోయే ప్రమాదాల భయం దగ్గరి నుంచి పర్యావరణవాదులు చెప్పే శాస్త్రీయ విశ్లేషణ దాకా అనేక కారణాలున్నాయి. ప్రజలకు తక్షణమే కనిపిస్తున్న కారణాలు, ఈ ఫాక్టరీలకు అవసరమైన విపరీతమైన నీరు, దానివల్ల తమ జలవనరులకు రానున్న ప్రమాదం, ఫాక్టరీల నుంచి వెలువడే జల, వాయు కాలుష్యాల వల్ల తమ ఆరోగ్యాలు, తమ పంటలు, తమ భూమి, తమ చుట్టూ ఉన్న జీవజాతుల మీద పడబోయే ప్రతికూల ప్రమాదం గురించిన భయాలు. నిజానికి ఈ భయాలు ఎవరో పర్యావరణవాదులో, సామాజిక కార్యకర్తలో కల్పించినవి కావు. ఇథనాల్ ఫాక్టరీ రాబోతున్నదని వార్తలు వచ్చిన ప్రతిచోటా జనం అంతకు ముందు ఇథనాల్ ఫాక్టరీలు ఉన్న చోటికి వెళ్లి, అక్కడ ఏమి జరిగిందో, అక్కడి ప్రజలకూ, భూమికీ ఏమి జరిగిందో చూసి వచ్చారు. ఆ స్వానుభవం మీదనే తమ గ్రామంలో, తమ పరిసరాల్లో ఇథనాల్ ఫాక్టరీ రాగూడదని ఉద్యమాలు ప్ర్రారంభించారు. ఆ ఉద్యమాలలో దిలావర్ పూర్ వంటి కొన్ని చోట్ల విజయం సాధించారు. చిత్తనూరు వంటి చోట్ల విజయం సాధించలేకపోయారు. కరీంనగర్ జిల్లా పర్లపల్లిలో ప్రజలు తెలుసుకుని వ్యతిరేకించ ముందు నుంచే పది సంవత్సరాలకు పైగా ఆ విష ప్రభావానికి గురి అవుతున్నారు.

తమ భూమి కలుషితమవుతుందని, అది తమ వ్యవసాయాన్ని దెబ్బతీస్తుందని, తమ ఆరోగ్యాలు చేడిపోయి, ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ప్రజలు భయపడడం ఒక ఎత్తు. ఇథనాల్ పరిశ్రమ గురించి పర్యావరణ శాస్త్రవేత్తల విశ్లేషణల్లో బైటపడుతున్న వాస్తవాలు మరొక ఎత్తు. అవి వింటే ఒక గ్రామంలో మాత్రమే కాదు, ఎక్కడైనా ఇథనాల్ పరిశ్రమ అవసరమా అని సందేహం వస్తుంది. నిజానికి ఆ విశ్లేషణలన్నీ రాయాలంటే ఒక వ్యాసం సరిపోదు.

గత బుధవారం, జూన్ 4న, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివార్లలో ఇథనాల్ కర్మాగారం నెలకొల్పడానికి గాయత్రీ రిన్యూవబుల్ ఫ్యుయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలను ఆ కర్మాగార కాలుష్యం వల్ల బాధితులు కానున్న గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కంపెనీ తీసుకువచ్చిన ప్రైవేటు సైన్యమూ, బౌన్సర్లూ ప్రజల మీద దాడిచేసి మరియమ్మ అనే మహిళ తల పగులగొట్టి, తీవ్రంగా గాయపరిచాక, ప్రజా నిరసన ఆగ్రహ ప్రకటనగా మారింది. కంపెనీ కార్యాలయంగా ఉపయోగించడానికి తెచ్చిన కంటెయినర్ ను కూలదోసి, నిప్పు పెట్టారు. కంపెనీకి చెందిన వాహనాలను తగులబెట్టారు.

ఇథనాల్ అనేది రంగూ వాసనా లేని ఒక ద్రవపదార్థం. దాని శాస్త్రీయ నామం ఇథైల్ ఆల్కహాల్. పాత రోజుల్లో చెరకు ఫాక్టరీలలో ఉప ఉత్పత్తిగా వెలువడే మొలాసిస్ నుంచి దాన్ని తయారు చేసేవారు. దాన్ని బియ్యం, గోధుమలు, మక్కజొన్న, జొన్న వంటి ఆహార ధాన్యాలను పులియబెట్టడం ద్వారా కూడా తయారు చేయవచ్చు. దాన్ని గతంలో మద్యం తయారీలో వాడేవారు. ఇటీవల దాన్ని పెట్రోల్ లో కూడా కలిపి ఇంధనంగా వాడవచ్చునని తేలింది. అమెరికాతో సహా కొన్ని దేశాలు పెట్రోల్ లో పది శాతం ఇథనాల్ కలపడం ద్వారా పెట్రోల్ వాడకాన్ని ఆ మేరకు తగ్గించవచ్చునని ప్రయత్నిస్తున్నాయి. అక్కడా, బ్రిటన్ లోనూ ఇథనాల్ ఫాక్టరీల కాలుష్యం మీద కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. ఇథనాల్ తయారీలో, పులియబెట్టే ప్రక్రియలో అసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, ఆక్రోలిన్, హెక్సేన్ లాంటి విషవాయువులు వెలువడతాయి. ఈ వాయువులు మామూలు గాలిలో కలవడం వల్ల తక్షణమే కన్ను, ముక్కు, గొంతు దురద, తలనొప్పి,  వికారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఈ వాయువుల వల్ల కాన్సర్, ఉబ్బసం, శ్వాస నాళాల దీర్ఘకాలిక వాపు, వాయుకోశాల వ్యాకోచం వంటి సమస్యలు వసాయి. ఈ వాయువులు గర్భస్థ పిండాల మీద ప్రభావం వేసి శిశువులు బలహీనంగా, తక్కువ బరువుతో పుడతారు. ఇథనాల్ ఉత్పత్తి నుంచి వెలువడే వ్యర్థ జలాల్లో జలచరాలకూ మనుషులకూ హానికరమైన   అనేక విషపదార్థాలు ఉంటాయి.

ఇటువంటి హానికరమైన ఇథనాల్ ఫాక్టరీలు ఎందుకు వస్తున్నాయి? భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన ‘ఇథనాల్ 20 విధానం’ ప్రకారం 2025-26 నాటికి  దేశంలో వినియోగిస్తున్న పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యం నిర్ణయించింది. అందుకోసం ఇథనాల్ ఫాక్టరీలు పెట్టేవారికి కిలో బియ్యం రు. 20 కి సబ్సిడీ మీద ఇవ్వడం, ఆరు సంవత్సరాల పాటు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వడం, తయారు చేసిన ఇథనాల్ ను కొనుగోలు చేసే ఒప్పందాలు వంటి అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇథనాల్ ఫాక్టరీ పెడతామనే పేరుతో ప్రభుత్వం నుంచి భూమి, బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు, కారు చౌకగా బియ్యం సంపాదించి, ఫాక్టరీ ఊసే ఎత్తని వ్యాపారవేత్తలు ఉన్నారు గనుక ఈ పరిశ్రమను సబ్సిడీల, రాయితీల పరిశ్రమ అని కూడా అంటున్నారు. ఈ రాయితీలను మించి ఈ వ్యాపారవేత్తలకు ప్రభుత్వం చేసిన సహాయం, అంతవరకూ కాలుష్య కారక, రసాయనిక పరిశ్రమలు పెట్టడానికి బహిరంగ విచారణ (పబ్లిక్ హియరింగ్) జరిపి స్థానిక ప్రజల అనుమతి తీసుకోవాలని ఉండిన కాలుష్య నియంత్రణ మండలి నిబంధన నుంచి ఈ పరిశ్రమను మినహాయించడం. అంటే ఇప్పుడు గ్రామస్తులకు సమాచారం, అనుమతి లేకుండానే గ్రామంలో కాలుష్యకారక పరిశ్రమ ఏర్పాటు చేయవచ్చు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రభుత్వం ఎవరి “అభివృద్ధి” సాధించదలచుకున్నదో స్పష్టమే.

ఎన్ డి ఎ ప్రభుత్వం 2021లో ఈ విధానం ప్రకటించగానే, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తలకెత్తుకుని, అప్పటికే ఉన్న కార్పొరేట్ అనుకూల టిఎస్ ఐపాస్ విధానంతో కలిపి రాష్ట్రంలో దాదాపు 30 ఇథనాల్ ఫాక్టరీలకు అనుమతి ఇచ్చింది. ఇలా అనుమతి పొందిన వ్యాపారవేత్తలలో అన్ని రాజకీయ పార్టీల నాయకులూ ఉన్నారు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నది.

ఇథనాల్ అనేది రంగూ వాసనా లేని ఒక ద్రవపదార్థం. దాని శాస్త్రీయ నామం ఇథైల్ ఆల్కహాల్. పాత రోజుల్లో చెరకు ఫాక్టరీలలో ఉప ఉత్పత్తిగా వెలువడే మొలాసిస్ నుంచి దాన్ని తయారు చేసేవారు. దాన్ని బియ్యం,  గోధుమలు, మక్కజొన్న,  జొన్న వంటి ఆహార ధాన్యాలను పులియబెట్టడం ద్వారా కూడా తయారు చేయవచ్చు. దాన్ని గతంలో మద్యం తయారీలో వాడేవారు. ఇటీవల దాన్ని పెట్రోల్ లో కూడా కలిపి ఇంధనంగా వాడవచ్చునని తేలింది. అమెరికాతో సహా కొన్ని దేశాలు పెట్రోల్ లో పది శాతం ఇథనాల్ కలపడం ద్వారా పెట్రోల్ వాడకాన్ని ఆ మేరకు తగ్గించవచ్చునని ప్రయత్నిస్తున్నాయి.

అలా చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఒక వ్యాపారవేత్త (వైఎస్ఆర్ సిపి నాయకుడు అంటున్నారు) పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫాక్టరీ అనుమతి పొంది, ముప్పై ఎకరాల భూమిలో 2024 అక్టోబర్ లో నిర్మాణ పనులు ప్రారంభించాడు. అది ఇథనాల్ ఫాక్టరీ అని తెలిసిన ప్రజలు అడ్డుకోవడంతో అప్పుడు పనులు ఆగిపోయాయి. ఈ ఫాక్టరీ భూమిని ఆనుకుని దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఫాక్టరీ వస్తే తమ భూములు వ్యవసాయానికి పనికి రావని, ఆ ఇళ్లలో ఉండలేమని వారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ జనవరి 2025లో పనులు మొదలు కావడంతో గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రెండు వారాలకు పైగా సాగిన ఆ శాంతియుత ఆందోళన అధికారులు, రాజకీయ నాయకులు ఫాక్టరీని రానివ్వబోమని హామీ ఇవ్వడంతో ఆగిపోయింది.

ఈ ఫాక్టరీ వల్ల కేవల పెద్ద ధన్వాడ మాత్రమే కాదు, చిన్న ధన్వాడ, నసనూరు, మన్ దొడ్డి, నౌరోజీ క్యాంపు, చిన్న తాండ్రపాడు, వేణీ సోంపూర్, తుమ్మిళ్ల, తనగల, పచరాల, కేశవరం, పెద్ద తాండ్రపాడు, రాజోలి వంటి కనీసం 12 పరిసర గ్రామాలు, చుట్టూ ఉన్న 30,40 గ్రామాలు జల, వాయు కాలుష్యాల బారిన పడతాయి. పెద్ద ధన్వాడ సుంకేకేశుల ఆనకట్టకు ఎగువన తుంగభద్ర ఒడ్డున ఉండడం వల్ల ఈ ఫాక్టరీ వాడే జలాల గురించి, వ్యర్థ కలుషిత జలాలను తుంగభద్రలో వదలడం గురించి కూడా అనుమానాలున్నాయి. ఒక లీటర్ ఎథనాల్ తయారీకి నాలుగు లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ ఫాక్టరీ రోజుకు రెండు లక్షల లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేస్తుందంటున్నారు. అంటే ఎనిమిది లక్షల లీటర్ల నీరు వాడుతుంది. అది పరిసర గ్రామాల వ్యవసాయం మీద ప్రతికూల ప్రభావం వేస్తుంది. ఒక లీటర్ ఎథనాల్ తయారీకి రెండుంబావు కిలోల బియ్యం కావాలి. అంటే రోజుకు నాలుగున్నర లక్షల కిలోల బియ్యం ఈ ఫాక్టరీ ఒక్కటే మింగేస్తుంది. రాష్ట్ర ఆహార భద్రత సంక్షోభంలో పడుతుంది.

“ఇథనాల్ ఫాక్టరీ అభివృద్ధి కదా, అభివృద్ధిని అడ్డుకుంటే ఎట్లా” అని వాపోయేవారు ఈ వాస్తవాల నేపథ్యంలో అది ఎవరి అభివృద్ధో, ఎవరి ప్రాణాలు తీస్తున్నదో చూడాలి. అంతమాత్రమే కాదు, ఈ మహా ఘనత వహించిన పరిశ్రమ కల్పించే ఉద్యోగాలు కూడా లేవు. టిఎస్ ఐపాస్ లో ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారమే ఈ ఫాక్టరీలో ఉద్యోగుల సంఖ్య 50 మాత్రమే. అందులో ఈ కాలుష్యానికి గురయ్యే గ్రామాల నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోవచ్చు. రు. 190 కోట్ల పెట్టుబడితో వస్తున్నదని చెప్పుకునే ఈ పరిశ్రమ ప్రజాధనం నుంచి, బ్యాంకుల నుంచి వడ్డీ లేకుండా ఆ పెట్టుబడి సంపాదిస్తుంది. ఆ పెట్టుబడిని మరోకచోటికి తరలిస్తుంది. ఆ బ్యాంకు రుణాలు ఎగ్గొడుతుంది. రాయితీకి బియ్యం సంపాదిస్తుంది. ఆ బియ్యం బైటి మార్కెట్లో ఎక్కువధరకు అమ్మి లాభం చేసుకుంటుంది. అలా కాకుండా, నిజంగానే ఇథనాల్ తయారు చేస్తే, ఒకవైపు స్థానికుల ఆరోగ్యాలూ ప్రాణాలూ కొల్లగొడుతుంది. మరొకవైపు ఆ ఇథనాల్ ను ఎక్కువ ధరకు చమురు కంపెనీలకు అమ్మి, మళ్లీ అక్కడా ప్రజాధనం కొల్లగొడుతుంది. మొదటి నుంచి చివరి వరకూ ఇది అంతా లూటీ వ్యవహారమే. ఇంతటి మహత్తరమైన లూటీ వ్యవహారం ఒక “వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిది” కాబట్టి దాన్ని అడ్డుకునే కుట్రే ఈ ప్రజాందోళన అని ఒక “వెనుకబడిన కులాల నాయకుడు” వ్యాఖ్యానించడం ఈ మొత్తం విషాదంలో ఒక హాస్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page