– బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా మంగళవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తరలివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను పట్టించుకోవడంలో విఫలమవుతున్నందుకు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. రిటైర్మెంట్ ప్రయోజనాల వాయిదా చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ప్రచారం చేయాలి
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎన్నికల కో-ఇన్‌చార్జి అశోక్ పర్ణామి, రాజ్యసభ సభ్యురాలు, ఎన్నికల కో ఇన్‌చార్జి రేఖాశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ఇతరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహాలను సమీక్షించడంతోపాటు పార్టీ చేపట్టనున్న కార్యాచరణను అమలు చేయడం, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్‌రావు దిశానిర్దేశం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





