మెరుగైన పాల‌న అందించండి

– నూత‌న‌ స‌ర్పంచ్‌ల‌కు మంత్రి పొంగులేటి సూచ‌న‌

కూసుమంచి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని  రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు.  నూతన సర్పంచ్‌లకు శాలువ కప్పి, స్వీట్లు తినిపించి మంత్రి అభినందనలు తెలిపారు. అలాగే ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా అభినందిస్తూ… గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులను కూడా కలిసి ఆయన మాట్లాడారు. అధైర్యపడొద్దని, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని హితవు పలికారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధైర్యం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page