ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్‌లో శీతాకాల విడిది ముగిసింది. సోమ‌వారం సాయంత్రం దిల్లీ తిరిగి వెళ్తున్న ఆమెకు హ‌కీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్‌రెడ్డిలు వీడ్కోలు పలికారు. వీరితోపాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇత‌ర ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు వీడ్కోలు ప‌లికారు. బొల్లారంలోని ్ర‌పెసిడెంట్ భ‌వ‌న్‌లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర‌ప‌తి తేనీటి విందు ఇచ్చారు. ఐదు రోజుల రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు ఈనెల 17న ఆమె హైద‌రాబాద్‌కు వచ్చిన విష‌యం విదిత‌మే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page