ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– నవీన్‌ ‌రావు తండ్రికి సిట్‌ ‌నోటీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ ‌రావు తండ్రి కొండల్‌ ‌రావుకు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్‌ ‌రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ ‌పీఎస్‌కి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్‌ ‌రావును సిట్‌ అధికారులు విచారించారు. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. బీఆర్‌ఎస్‌ ‌పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాల గురించి నవీన్‌ ‌రావును అధికారులు విచారించినట్లు సమాచారం. విచారణ అనంతరం నవీన్‌ ‌రావు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో విచారణకు హాజరయ్యానని, అప్పట్లో మూడు గంటల పాటు అధికారులు తనను విచారించారని చెప్పారు. అప్పుడు చెప్పిన విషయాలనే ఇప్పుడు కూడా చెప్పానని అన్నారు. విచారణకు సహకరించానని, మళ్లీ పిలిచినా కూడా వస్తానని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page