ఉచితాలు అవసరం లేదు ..ఉపాధి కల్పించండి..!

రంజాన్‌ ‌నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌, ఇతర కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రు.70 కోట్ల నిధులను విడుదల చేయడం పై అదే మతానికి చెందిన సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగించాలని సూచన చేసారు. ఒక వైపు సమాజం పట్ల పౌర సమాజం దృష్టి సారిస్తుంటే ..మరో వైపు  నేల విడిచి సాము చేయడం..వోట్ల కోసం పథకాలను చేపట్టడం..పాత పథకాలను కొనసాగించడం తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచన కానీ, ప్రణాళిక కానీ  రాష్టాల్రను ఏలుతున్న పాలకుల్లో కనపించడం లేదు. ఎంతసేపు కొత్త పథకాలు ప్రకటించడం, నిధులు లేక చతికిలపడడం చూస్తున్నాం. డబ్బుల దుబారాను అరికట్టలేక పోతున్నారు. దుబారా పథకాలను తగ్గించడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు, రేవంత్‌ ‌రెడ్డిలు ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు. గతంలో పాలించిన జగన్‌, ‌కెసిఆర్‌లు కూడా అదే చేసారు. ఉట్టికెగరలేని వాడు ఆకాశానికి ఎగిరినట్లు అన్న చందంగా వీరి పాలన ఉంటోంది. గ్రామాల్లో మంచినీటి సదుపాయం, సాగునీటి సౌకర్యాలు, విద్యుత్‌ ‌సౌకర్యం, రోడ్లు వేయడం, స్కూళ్లు, హాస్పిటల్స్  ‌పటిష్టం చేయడం వంటి ప్రాథమిక అవసరాలను పక్కాగా చేయడంలో పాలకులు విఫలం అవుతున్నారు. కోతుల బెడద విపరీతంగా ఉన్నా అటవీశాఖ చేష్టలు ఉడిగి చూస్తోంది.

ఆదాయ వనరులను లెక్కవేయకుండా, అదేపనిగా అప్పులు చేస్తూ వడ్డీలు కడుతూ, రాష్టాల్రను దివాలా  తీయిస్తున్నారు. రేషన్‌ ‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచితబస్సు,పెన్షన్లు అభివృద్ది సూచికలు కాదని గుర్తించాలి. ప్రజలకు తాయిలాలు వేయడమెలా అన్న దారిలోంచి పక్కకు రావాలి. ప్రజలు కూడా ఉచితాల వలలో పడి దరిద్రాలను కొనితెచ్చుకుంటున్నారు. గతంలో రాష్టాన్న్రి అప్పులకుప్పగా చేసి, కుటుంబ పాలన చేసిన కెసిఆర్‌ ‌కూడా నీతులు వల్లిస్తున్నారు. ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇప్పుడు గోసపడుతున్నారని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.  ప్రజలందరూ తన పాలనకోసం చూస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎపిలో అయితే బటన్లు నొక్కడం ద్వారా ప్రజలకు డబ్బు పంచాను. అయినా నన్ను ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదని జగన్‌ ‌వాపోయారు. ఈవీఎంల ద్వారా ఏదో గోల్‌మాల్‌ ‌చేసి ఉంటారని తన అసమర్థతను అలా చాటుకున్నారు.  ఈవీఎంలను మేనేజ్‌ ‌చేసి ఉంటారని  2019లో ఓటమి అనంతరం చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు.

తాము బాగు చేశామని అనుకోవడం మినహా ప్రజలు అనుకుంటున్నారా లేదా అన్నది ఆలోచచించడం లేదు. గ్రామాల్లో పచ్చదనం కరువయ్యింది. పశువులకు గ్రాసం దొరకడం లేదు. ఎండాకాలానికి ముందే మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గ్రామాల్లో కోతుల బాధ విపరీతంగా ఉంది. వీటి గురించి ఆలోచచించడం లేదు. డిలిమిటేషన్‌ ‌సీట్లు, హిందీ వద్దనడం వంటి వాటిపట్ల కొందరు చేసే ఆందోళనకు మద్దతు పలకడం అలవాటు చేసుకున్నారు. ఎన్ని సీట్లు పెరిగినా ప్రజలకు ఒరిగేదేముంది. పార్లమెంట్‌ ‌సీట్లు పెరిగితే మరింత ఖాజానా భారం తప్ప ప్రజలకు వొచ్చే లాభం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తాము ఏ తప్పూ చేయ లేదని, ప్రజలే తమను ఓడించి తప్పు చేశారని ప్రాంతీయ పార్టీలకు నాయకలు చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకానానికి నిదర్శనంగా చూడాలి. అధికారంలోకి వొచ్చినవారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలను దూరం పెడుతున్నారు. ప్రజలు నేరుగా వొచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజావాణితో తెలంగాణలో అర్జీలు స్వీకరించడం ఓ ఫ్యాషన్‌గా మారింది. ప్రజల సమస్యలు పరిష్కారం అయినట్లు దాఖలాలు లేవు. ప్రజల మనోభావాలను తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడిన విషయాన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలు తెలుసుకోలేక పోతున్నారు. పాలన అంటే పందేరాలు, పెన్షన్లు, రేషన్‌ ‌కార్డులే అనుకుంటున్నారు. వీటికోసం వేలకోట్లు తగలేసి అప్పులు చేస్తున్నారు. దీంతో అభివృద్ది అన్నది కానరావడం లేదు. తమ హంగూ,ఆర్భాటాలు, రక్షణ, జీతాలు, పెన్షన్లకు వేలకోట్లు తగలేస్తున్నారు.  ప్రజల మనోభావాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తే తాము ఎక్కడ ఉన్నామో తెలిసి పోతుంది.

కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తుందని ఆ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్లు కూడా ముందే చెప్పారు. బిజెపి కూడా పాలనలో మార్పు చూపిం• •లేకపోతున్నది. జిఎస్టీ వసూళ్లు ప్రజల నడ్డి విరుస్తున్నా పట్టించుకోవడం లేదు.  తన పాలన పట్ల 70 శాతానికి పైగా ప్రజలు సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. రేవంత్‌ ‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. గత అనుభవాలను విస్మరించి ఇప్పుడు మళ్లీ ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్ అని కలవరిస్తున్నారు. ఏఐ అంటే ఏమిటో 90 శాతం ప్రజలకు తెలియదు. వాటివల్ల కలిగే ప్రయోజనాలేమిటో అంతకంటే తెలియదు. 90 శాతానికి పైగా ప్రజలకు తెలియని అంశాన్ని పదేపదే వల్లెవేయడం వల్ల ప్రయోజనం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి సంతోషంగా ఉండేందుకు ప్రతి ఆదివారం అమలు జరిగేలా ఒక కార్యక్రమం రూపొందిస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు.

ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. కొంతమంది మినహా మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులపై పని భారం కూడా అధికంగా ఉండటం లేదు. చంద్రబాబు పాలనలో నిరంతర సక్షల వల్లనే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతారన్న విషయం తెలుసుకోవడం లేదు. ఇకపోతే సక్ష చేసిన అంశం అమలువుతుందా అన్న పరిశీలన లేదు. క్షేత్రస్తాయికి దానిని తీసుకుని అమలు చేశారా అంటే అదీ లేదు.  ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యాలను నిర్దేశిరచుకొని సత్వర నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులపై ఒత్తిడి ఉండదు. గ్రామస్థాయి ప్రణాళికలు ఇందుకు ముఖ్యం. ఏ గ్రామంలో ఏమి అవసరం అన్నది ముఖం. కులగణనలు కాదు. దాంతో చిచ్చులు రేగుతాయే తప్ప మరోటి కాదు. రాజీవ్‌ ‌పేరుతో మరో పథకం తెస్తామని తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటించారు. డబ్బులకు ఇబ్బంది పడుతుంటే పథకాలతో బురిడీ కొట్టించడం సరికాదు. ఇవన్నీ ఎందుకంటే పాలకులకు ముందు చూపు ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో  చూడాలి. అలాగని ఉచిత పథకాలతో మభ్య పెట్టడం కాదు. కనీస వసతులు కల్పించి, ప్రజలు వారి కాళ్లద వారు నిలబడేలా చేయగలగాలి.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page