ఏ ‌శాఖ ఇచ్చినా సంతోషమే

– మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు
– తనపై ఆరోపణలు ఏవీ రువు కాలేదు
– కిషన్‌ ‌రెడ్డికి నా గురించి సరిగా తెలియదు
– మంత్రి అజారుద్దీన్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31:‌మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్‌ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో అజారుద్దీన్‌ ‌మాట్లాడారు. భాజపా, భారత రాష్ట్ర సమితి నేతలు తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు.  నాపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమే. బీజేపీ, భారత రాష్ట్ర సమితి నేతల విమర్శలు సరైనవి కావు. నా గురించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదు. నాపై ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలుస్తుంది. మంత్రిగా నాకు అవకాశం కల్పించారు.. నాకు ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని అజారుద్దీన్‌ అన్నారు.తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్‌ ‌నేత అజారుద్దీన్‌ ‌శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు అజారుద్దీన్‌తో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మంత్రివర్గంలో అజారుద్దీన్‌ ‌చేరికతో తెలంగాణ కేబినెట్‌ ‌మంత్రుల సంఖ్య 16కి చేరింది. అయినా తెలంగాణ కేబినెట్‌లో ఇంకా 2 బెర్తులు ఖాలీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా నూతన మంత్రి అజారుద్దీన్‌కి సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు.  కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనకు ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. తన మంత్రి పదవికి, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముడి పెట్టొద్దని పేర్కొన్నారు. రెండింటినీ వేర్వురుగా చూడాలని కోరారు. తానేంటో ప్రజలందరికీ తెలుసని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అజారుద్దీన్‌ ‌స్పష్టం చేశారు. మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్‌ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో స్థానం కల్పించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page