జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌కు భారీ షాక్‌!

– కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు
– వోటరు కార్డులు పంచుతున్నారని ఎన్నికల అధికారి ఫిర్యాదు 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వోటరు కార్డులను నవీన్‌ యాదవ్‌ పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘానికి బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు, ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన జూబ్లీహిల్స్‌ ఎన్నికల అధికారి రజినీకాంత్‌ రెడ్డి నవీన్‌ యాదవ్‌పై మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని వోటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా ఎన్నికల సంఘం భావించింది. దీంతో పోలీసులు ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 170, 171, 174తోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు అయింది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నవీన్‌ యాదవ్‌పై క్రిమినల్‌ కేసు నమోదవడం కాంగ్రెస్‌కు భారీ దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆయనను పార్టీ అభ్యర్థిగా అనుకున్నట్లు రాజకీయా వర్గాల్లో వార్తలు కూడా వినిపించాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page