– ముఖ్యమంత్రితో కమ్మ సంఘాల నాయకులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: అమీర్‌పేట్ మైత్రీ వనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పదవుల్లో తమ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కమ్మ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంగళవారం వారు కలుసుకుని ఆయనతో పలు విషయాలు చర్చించారు. జూబ్లీహిల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కమ్మ సంఘాలు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. మైత్రీ వనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతోపాటు కమ్మ సంఘాల నాయకుల విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి ఇన్‌చార్జి బండి రమేశ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





