హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డాక్టర్ అంబేద్కర్ సచివాలయానికి చేరుకున్న మంత్రి శ్రీహరికి మంత్రోచ్ఛారణలతో వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్‌లో వాకిటి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి
