గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తెలంగాణ

ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు
‘బేకర్ హ్యూస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాక గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులోని ‘ఆజాద్-సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌’లో 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ది ఎక్స్ క్లూజివ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్’ను ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బేకర్ హ్యూస్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. ఒకప్పుడు రక్షణ పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే నిలయమైన హైదరాబాద్ నేడు ప్రైవేట్ రంగంలోనూ ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిందన్నారు. అంతేకాÅ£ 1500కు పైగా ఎంఎసఎంఈలతో హై ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్‌లోనూ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, ఎయిర్‌బస్, హనీవెల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సైతం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ఇక్కడి ఎకో సిస్టం కారణమన్నారు. ఆ దిశగా అప్పట్లో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన బలమైన పునాదులు ఇప్పుడు తెలంగాణను పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మార్చాయన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో జాతీయ భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ ‘బేకర్ హ్యూస్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అండ్ ఎక్విప్‌మెంట్(వోఎఫఎసఈ), ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ టెక్నాలజీ(ఐఈటీ), టెక్నాలజీ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.. ఈ సంస్థ ఐఈటీ విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్ ఉత్పత్తులు తాజాగా ప్రారంభమైన ఈ యూనిట్‌లో తయారవుతాయి.. కొత్తగా 230 మందికి ఉపాధి లభిస్తుంది అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో బేకర్ హ్యూస్ ప్రతినిధులు డేవిడ్ మర్రానీ, స్టీఫెన్ హిన్సన్, మార్సెల్లో బారియాని, రోసానో చియెల్లి, మాసిమిలియానో తుర్సీ, మౌరో బ్రాకో, విశాల్ ముర్గుడ్కర్, లియో డి ఫిలిప్పో, ఆజాద్ ఇంజనీరింగ్ ఛైర్మన్, సీఈవో రాకేష్ చోప్దార్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *