కూడవెల్లి జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

– ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్యను పురస్కరించుకుని నిర్వహిస్తున్న మూడు రోజుల జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుబ్బాక సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అధిక ధరలు వసూలు

భక్తుల నుంచి కొందరు వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సాధారణంగా రూ.40లకు విక్రయించే కొబ్బరికాయను చిల్లర లేదన్న కారణంతో రూ.50కు విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇతర పూజా సామగ్రి, తినుబండారాల ధరల విషయంలోనూ ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ధరల నియంత్రణపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *