కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ సందర్శించిన ఎంపీ రఘునందన్‌

– త్వరలో స్టేషన్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా

కొమురవెల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లోనే రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఈ స్టేషన్‌ను పూర్తి చేసినందుకు పధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు దండ్యాల లక్ష్మారెడ్డి, కొమురవెల్లి మండల శాఖ అధ్యక్షురాలు బూర్గోజు స్వరూప, మండల ప్రధాన కార్యదర్శులు ఎక్కలదేవి శ్రీనివాస్‌, పుట్ట కనకయ్య, సీనియర్‌ నాయకులు దండ్యాల బిక్షపతి రెడ్డి, గుర్రాల రాములు, ఘనబోయిన శ్రీనివాస్‌ గౌడ్‌, సానాదీ కరుణాకర్‌, పబ్బోజు రాజుచారి, బూర్గోజు నాగరాజు, యువమోర్చా మండల అధ్యక్షుడు నరేడ్ల నరేందర్‌ రెడ్డి, కొమురవెల్లి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బుడిగే బాలమని, అయినాపూర్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు బాలచందర్‌, పాశం భరత్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page