https://www.prajatantranews.com/minister-kishanr…-inspects-gandhi/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాంధీ హాస్పిటల్‌ను సోమవారం పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ సూపరింటెండెంట్‌తోపాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆస్పత్రి భవనాలను, వాటి నిర్వహణను స్వయంగా పరిశీలించారు అయితే ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. అనంతరం హాస్పిటల్‌లో ఉన్న ప్రస్తుత ఖాళీలు ఎన్ని? వైద్య సిబ్బంది, వైద్యులు మొత్తం ఎంతమంది ఉన్నారు ..డాక్టర్ల కొరత ఏమైనా ఉందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సర్జరీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయనేది తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డయాగ్నస్టిక్స్ పరిస్థితి ఏంటి? రోగులకు ఏలాంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు ఏయే వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ కింద వైద్య పరీక్షలు ఎలా కొనసాగుతున్నాయి, దాని కింద ఏ రకం పోస్టులు ఎన్ని ఉన్నాయి.. ఎంతమంది సిబ్బందిని నియమించుకున్నారు అవి సూపరింటెండెంటను అడిగారు. ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదవుతుంటాయి, ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కేసులు నమోదయ్యాయి.. ఇక్కడే అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారా వంటి ప్రశ్నలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
గాంధీ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి కిషన్ రెడ్డి
