గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడం తో జరిగిన ఘోర ప్రమాదం లో ప్రయాణికులు, సామాన్యులు, సహా ,వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు.
మరణించిన కుటుంబాలను నష్టపరిహారం ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేసీఆర్ కోరారు. తమ ఆప్తులను కోల్పోయి శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.