బిఆర్‌ఎస్‌ ‌పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం

ప్యాకేజ్‌ 17,18,19‌లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు
బసమేశ్వర, సంఘమేశ్వర ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం..
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లోని ప్యాకేజ్‌ 19 ఏ ‌నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మంగళవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పట్లోళ్ళ సంజీవ రెడ్డి, గవినోళ్ళ మధుసూదన్‌ ‌రెడ్డి, ఆదినారాయణ తదితరులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సమాధానమిస్తూ ప్యాకేజ్‌ 17,18,19 ‌లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.

నారాయణఖేడ్‌ ‌నియోజకవర్గ పరిధిలో 39 వేల కొత్త ఆయకట్టు సృష్టించేందుకు పెద్దారెడ్డి ఎత్తి పోతల  పథకం ఏర్పాటుకు సర్వే అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. అంచనాలు పూర్తి కాంగనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వాస్తవానికి ప్యాకేజ్‌ 19ఎ ‌కింద ఉన్న 39వేల ఎకరాల ఆయకట్టును పెద్దారెడ్డి పేట ఎత్తిపోతల పథకం కిందికి తీసుకురావాలన్న అంశం పరిశీలనలో ఉందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని వెంగళరాయి సాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌స్థితిగతులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నారాయణ్‌ ‌ఖేడ్‌, ‌జహీరాబాద్‌ ‌నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించబడిన బసమేశ్వర, సంఘమేశ్వర ప్రాజెక్ట్ ‌లను గత ప్రభుత్వం ఏ కారణంగానో సరైన ప్రయత్నం చేయలేదన్నారు.అందుకు సంబంధించిన లిఫ్ట్ ‌లు, ప్రాజెక్ట్ ‌లు పూర్తి చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సభకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page