నర్సాపూర్ కాంగ్రెస్‌, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు.

*కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు.. 

*బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్

*రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్.

*-మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం

 

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ .. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గం, తునికి గ్రామానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్, బీజేపీ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో అమర్ సింగ్ రాథోడ్ (మాజీ ZPTC), సండ్రు, నవీన్, కుండలి కిషోర్, బక్క నరస గౌడ్, బిక్షపతితో పాటు ఇతర స్థానిక నాయకులు, 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు హైదరాబాద్ నివాసం లో గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి, ప్రజలను మోసం చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. బీజేపీ చెప్పేది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, వాస్తవానికి అది సబ్కా బక్వాస్.అని విమర్శిస్తూ బీజేపీ కేవలం ఉత్తర భారత దేశ పక్షానే ఉంటుంది, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది..గోదావరి నది తెలంగాణ గుండా పారి ఆంధ్రాలో కలుస్తుంది. కానీ రాబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు రూ. 100 కోట్లు ఇచ్చి, 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు. నార్త్ ఇండియాలో పండే గోధుమలకు ఉండే విలువ తెలంగాణలో పండే వరికి లేదు..కేంద్రం గోధుమలకు మద్దతు ధర పెంచి, మన వడ్లకు మాత్రం మొండి చేయి చూపించిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొంటూ..గోధుమల మద్దతు ధర వడ్ల కంటే రూ. 216 ఎక్కువగా ఉంది..దీనివల్ల మన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీజేపీకి వోటు వేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి రూ. 7000 నష్టపోయారు. .పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండి ఉంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు నిధులు తెచ్చేవాళ్లం అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణకు చేసిందేమీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది..నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది బీజేపీ కాదా? బావుల దగ్గర మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నించిందన్నారు. గల్లీలో కుస్తీ దిల్లీ లో దోస్తీ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పైకి కొట్టుకున్నట్లు నటిస్తారు.., లోపల మాత్రం రెండు పార్టీలు ఒక్కటే..కాంగ్రెస్ అవినీతి పాలనకు బీజేపీ రక్షణగా నిలుస్తున్నదని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కట్టిన బిల్డింగులకు రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప, కొత్తగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు అని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, ప్రజలకే బాకీ పడింది..మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి 22 నెలలు గడిచింది. .అంటే ఒక్కొక్క అక్కచెల్లెమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 55,000 బాకీ పడింది.. రూ.4000 పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. ఒక్కొక్క వృద్ధుడికి ప్రభుత్వం రూ. 44,000 బాకీ ఉంది..కాంగ్రెస్ నాయకులు వోట్ల కోసం ఊర్లలోకి వస్తే.. ఈ బాకీ పైసలు ఏవి అని నిలదీయాలి..రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు..అబద్ధపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ కు, తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు..ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరం కలిసికట్టుగా పని చేద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *