– బీజేపీకి మద్దతుగా జనసేన
– ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో భేటీ అయి బీజేపీ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు. రెండు పార్టీల నాయకులు బుధవారం జాయింట్ ప్రెస్‌మీట్ నిర్వహించి తమ భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో జరిగిన ఈ భేటీలో అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రెండు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీ జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జరిగినట్టు నాయకులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





