- కేటీఆర్కు త్యాగాల విలువ తెలియదు..
- యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే
- కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి (Jagga reddy) ఫైర్ అయ్యారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించిందని, ఈ విష యంలో కాంగ్రెస్ పార్టీని చిల్లర పార్టీ అని బీఆ ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిత్వం లేని వాడిలా మాట్లాడుతున్నాడని జయప్రకాష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ..తెలంగా ణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..? అని ప్రశ్నించారు. తెలం గాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కారు కదా…అప్పుడు చిల్లర అనిపించలేదా..? అని నిలదీశారు
మీ కుటుంబం వెలిగిపోతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా..? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీ ఆ ర్ వ్యక్తిత్వం లేనివాడని మండిపడ్డారు. సోని యా గాంధీ వల్లనే తెలంగాణ వొచ్చింది అని కేసీఆర్ సభలో చెప్పాడు.. ఆ మాట కేటీఆర్ మర్చి పో యినట్టు ఉన్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ ఐతే.. ఆ పార్టీ పాఠా లు నేర్చుకున్న ..మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా..? అని ఎద్దేవా చేశారు. థర్డ్ క్లాస్ నుండే కదా.. కేటీఆర్ రాజకీయ నాయకుడివి అయ్యిందన్నారు.
కాంగ్రెస్ అంటే ఏందో కేసీఆర్ కేసీఆర్ ను అడిగి తెలుసుకోవాలని కేటీఆర్ కు సూచిం చారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం వొచ్చేదా అని ప్రశ్నించారు. సుదర్శ న్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పెడితే.. తెలంగాణ బిడ్డగా ఆయనకు వోటేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీదనే ఆరోపణలు చేయడం కేటీఆర్.. కేసీఆర్ ల అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. కేటీఆర్.. పదేళ్లు మంత్రిగా ఉన్న రాజకీయ పరిణతి రాలేదన్నారు. అందుకే మాటలు దొర్లుతున్నాడని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తాత..నానమ్మ బతికి ఉంటే కేటీఆర్ ను పిలిచి తిట్టే వారని, చెంప మీద కొట్టేవాళ్ళని అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ బుద్ధి చెప్పే వారిని అన్నారు. త్యాగాల విలువ కేటీఆర్ కి తెలియదని చెప్పారు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులని, కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయగలడా.? ప్రశ్నించారు. తిని దీక్ష చేసినా ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చేవారని తెలిపారు. తెలంగాణ వొచ్చి ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం ప్రయోజనం దక్కిందన్నారు. కేటీఆర్ తొందర పడి మాట్లాడి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందని పేర్కొన్నారు. తాను సచివాలయంలో రివ్యూ చేస్తే, బీ ఆర్ ఎస్ చేస్తున్న ఆరోపణలు పస లేనివి అన్నారు. ప్రతిపక్షం లో ఉన్నా.. అధికారంలో ఉన్నా దర్జాగా ఉంటానన్నారు. సచివాలయం లో దందా చేస్తే తప్పు కానీ.. ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. సంగారెడ్డి ప్రజలకు మంజీరా నీళ్ళ కోసం సమీక్ష చేశానని చెప్పారు. కే సీ ఆర్ కుటుంబం వలే కొడుకు..అల్లుడు.. బిడ్డ పంచుకున్నట్టు పంచుకున్నానా..? అని ప్రశ్నించారు. గెలుపు ఓటములు సహజమని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంచి వ్యక్తి, సౌమ్యుడు అని చెప్పారు. ఆయన కూడా స్క్రిప్ట్ లీడర్ కావడమే వొచ్చిన సమస్య అని చెప్పారు. ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ రాసి ఇచ్చింది చదువుతారని తెలిపారు. యూరియా మీరు ఇవ్వకుండా కిషన్ రెడ్డి మాట్లాడి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ఎరువులను అడ్డం పెట్టుకుని బీజేపీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.
యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే అని చెప్పారు. వేల కోట్లు రైతులకు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్రం సరఫరా చేస్తే ఎరువులు ఇవ్వడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశ్నించారు. రైతుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు వొస్తారని వీరి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు యూరియా అందించే పనిలోనే ఉన్నారన్నారు. కేంద్రం దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.





