హర్మూజ్‌పై పట్టు కోసం ఇరాన్ బెట్టు

– అమెరికన్లను ఎప్పుడూ నమ్మబోమన్న ఇరాన్

టెహ్రాన్, జూన్ 23: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలోనూ హర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నాయి. హర్మూజ్ నిర్వహణను తామే చూసుకుంటామని ఇరాన్ దేశ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి.. యుద్దానికి ముందున్న స్థితికి ఎప్పటికీ తిరిగిరాదన్నారు. మేం అమెరికన్లను ఎన్నడూ నమ్మలేదు. ఇప్ప్పుడూ నమ్మడం లేదు. భవిష్యత్తులోనూ వారిపట్ల ఆ ధోరణితో ఉండటం సమంజసమే అని అమెరికా పట్ల ఇరాన్‌కున్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి తుది ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. కాగా, తమ నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఇరాన్ అంగీకరిస్తే ఫ్రీజ్ చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  హర్మూజ్‌పై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉందని ప్రకటించారు. ఈ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ దేశం తాజా పరిణామాలపై స్పందించింది. అంతర్జాతీయ చట్టాలకు, టోల్ రహిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇరాన్`అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *