మహాత్ముడిని అవమానించారు

– రాష్ట్రాలపై భారం మోపేలా బిల్లు: కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక 

న్యూదిల్లీ, డిసెంబర్‌ 18:‌మ‌హాత్మా గాంధీని అవమానించేందుకే కొత్తగా వీబీ జి -రామ్‌ ‌జీ బిల్లును తీసుకుని వచ్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ  ప్రియాంకగాంధీ ఆరోపించారు. సభ వాయిదా పడిన తరువాత పార్లమెంట్‌ ‌వెలుపల ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ – రామ్‌జీ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. బిల్లులోని వివరాలను చదివిన ఎవరికైనా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎలా పూర్తి కాబోతోందో అర్థమవుతుంద‌న్నారు. ఈ బిల్లు వలన రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం పడనుందని, రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందిపడే అవకాశం ఉందని తెలిపారు. నరేగా పథకం పేదలకు అండగా ఉండేది.. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పేదలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రియాంక తీవ్ర విమర్శలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page