వేధింపులపై కమిటీతో విచారణ

– మహిళా వర్సిటీ ప్రిన్సి పాల్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15: ‌కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. అయితే ఈ ఆరోపణలపై వర్సిటీ ప్రిన్సిపాల్‌ ‌లోకపావని స్పందించారు. మెస్ ఇన్‌చార్జ్ ‌వినోద్‌ ‌తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులతోపాటు యూనివర్సిటీ నుంచి ప్రత్యేక కమిటీని వేసి విచారిస్తున్నామన్నారు. విద్యార్థులపై వేధింపులు జరిగాయని స్థానిక పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారని, వేధింపులపై హాస్టల్‌ ‌వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు గతంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపారు. మెస్ ఇన్‌చార్జ్ ‌వినోద్‌పై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు. లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఎవరో తెలియదని చెప్పారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్‌ ‌చెయ్యబోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు సమస్యలుంటే మొదటగా తమకు చెప్పాలని కోరారు. విద్యార్థులు అభద్రతా భావానికి గురికావద్దని సూచించారు. యూనివర్సిటీ, హాస్టల్‌ ‌మెస్‌లో విద్యార్థుల వసతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. హాస్టల్‌లో తక్కువ స్థలంలో ఎక్కువమంది విద్యార్థులు  ఉంటున్నారని తెలిపారు. సీసీ కెమెరాల కొరత వేధిస్తోందని చెప్పారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ‌లోకపావని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page