మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృత దేహం అప్పగింతలో సాగిన హైడ్రామా –
వాస్తవం చెప్పాలంటే ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేశవరావు బంధువులు మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం తమకు అప్పగించమని పిటిషన్ వేసినపుడే న్యాయ మూర్తి ఆదేశాలు ఇవ్వక ముందే ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ పోస్టు మార్టం అనంతరం మృత దేహాన్ని బంధువులకు అప్పగించుతామని చెప్పడంతో హైకోర్టు న్యాయమూర్తి కూడా అదే ఆదేశాలు జారీ చేశారు. ఇందులోనే మతలబు ఇమిడి వుంది. హైకోర్టు న్యాయమూర్తి నేరుగా ఆదేశాలు జారీ చేసి ఉంటే హైకోర్టులో పిటిషన్ వేసిన కేశవరావు సోదరునికి మృతదేహం విధిగా అప్పగించ వలసి వచ్చేది. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు మాట ఇచ్చి తప్పించుకొన్నందున కేశవరావు తాలూకా బంధువులు దాఖలా చూప లేదని ఇతర కారణాలు చూపి తప్పించుకొనే అవకాశం మిగుల్చుకున్నారు.
తాము ఎన్ని కుంటి సాకులు మిగుల్చుకున్నా హైకోర్టు ముందు దోషిగా నిలబడ వలసి ఉంటుందనే భయంతోనే కేశవరావు ఆయన సహచరుడు మృత దేహాల్ని దహనం చేసిన తర్వాత కూడా ఛత్తీస్ ఘడ్ పోలీసు అధికారులు హైడ్రామా నడిపారు. మృతదేహాన్ని ఇవ్వక పోయినా కనీసం చితాభస్మం ఇవ్వమని కోరిన కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ ను నారాయణ పూర్ పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి – వారి అనుమతితోనే దహనం చేసినట్లు తమకు అనుకూలంగా పిటిషన్ రాసి చివరగా చితాభస్మం కోరినట్లు రాసితే అందుకు కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ తదితరులు అంగీకరించకుండా తప్పించుకొని వచ్చినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే తాము చేసిన ఘాతుకం హైకోర్టులో మెడకు చుట్టుకొంటుందనే భయం ఛత్తీస్ ఘడ్ పోలీసులకు వున్నట్లుంది.
తాము ఎన్ని కుంటి సాకులు మిగుల్చుకున్నా హైకోర్టు ముందు దోషిగా నిలబడ వలసి ఉంటుందనే భయంతోనే కేశవరావు ఆయన సహచరుడు మృత దేహాల్ని దహనం చేసిన తర్వాత కూడా ఛత్తీస్ ఘడ్ పోలీసు అధికారులు హైడ్రామా నడిపారు. మృతదేహాన్ని ఇవ్వక పోయినా కనీసం చితాభస్మం ఇవ్వమని కోరిన కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ ను నారాయణ పూర్ పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి – వారి అనుమతితోనే దహనం చేసినట్లు తమకు అనుకూలంగా పిటిషన్ రాసి చివరగా చితాభస్మం కోరినట్లు రాసితే అందుకు కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ తదితరులు అంగీకరించకుండా తప్పించుకొని వచ్చినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే తాము చేసిన ఘాతుకం హైకోర్టులో మెడకు చుట్టుకొంటుందనే భయం ఛత్తీస్ ఘడ్ పోలీసులకు వున్నట్లుంది..కేశవరావు ఆయన సహచరుడు మృత దేహాల్ని ఇచ్చి వుంటే వారి బంధువులు రీ పోస్టుమార్టం కోరే అవకాశం ఉందని వాస్తవంలో కేశవరావు ఆయన సహచరుడు ఎన్ కౌంటర్ లో చనిపోలేదని రాయపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంటే పట్టుకొని వచ్చి ఎన్ కౌంటర్ చేసినట్లు ఆయన బంధువులు ఆరోపించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ భయంతోనే మృత దేహాల్ని ఇవ్వలేదని ఈ కథనాలు తెలిపాయి. కాని ఇందుకు భిన్నంగా ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ప్రకటన వుంది. ఎన్ కౌంటర్ సందర్భంగా కేశవరావును కాపాడుకోలేక పోయామని ఈ ప్రకటన తెలుపుతోంది. ఏదిఏమైనా పౌర హక్కుల సంఘాలు కోరుతున్నట్లు న్యాయ విచారణ జరిగితే ఏం జరిగిందీ వెలుగు చూస్తుంది.
అంతేకాదు. మావోయిస్టుల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి బహు దుర్మార్గంగా వుంది. అడవిలో జంతువులను వేటాడినట్లు క్రూరంగా కాల్చి చంపుతోంది. ఈ మారణహోమం అంత వరకే పరిమితం కావడం లేదు. మావోయిస్టులకు ఆశ్రమం ఇచ్చారని కొన్ని సందర్భాల్లో అన్నం పెట్టారని వార్తాహరులుగా ఉన్నారని వందలాది మంది ఆదివాసీలు పోలీసుల దాష్టీకానికి అతి క్రూర హింసలకు బలి అవుతున్నారు. మావోయిస్టుల పేరుతో ఎంతో మంది ఆదివాసీలు హతమార్చ బడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తుదకు బద్ద శత్రు దేశమైన పాకిస్థాన్ యెడల చూపిన ఔదార్యం కూడా మావోయిస్టులు యెడల చూపించ లేక పోతోంది. భారత్ పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ తన జోక్యంతో జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పరువు పోతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం పదేపదే పాకిస్తాన్ బలహీన పడి కోరినందున కాల్పుల విరమణకు తలపడినట్లు భారత్ అధికారులు పలు వేదికల మీద చెప్పుకొచ్చారు.
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు




