ఐక్యరాజ్యసమితికి తన పని చేయనివ్వండి
మే 15 ఉదయం, ఉత్తర గాజాలోని బీత్ లహియాలో తన తాతగారితో కలిసి బ్రెడ్ వేపడంలో సహాయం చేస్తున్న ఏడేళ్ల మిరాన్ మొహమ్మద్ ఆకలితో ఉండి, వేడి బ్రెడ్ కోసం ఎదురుచూస్తోంది. కానీ ఆ బ్రెడ్ తినే అవకాశం మిరాన్‌కు రాలేదు. ఆమె తల్లి, ఇంటికి వెళ్లిన తరువాతే తినాలని చెప్పడంతో, వారు ఇంట్లోకి అడుగుపెట్టగానే, ఇంటిపై బాంబు దాడి జరిగింది. భవనం కుప్పకూలడంతో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం మిరాన్ అల్-ఆహ్లీ అరబ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. డాక్టర్ల ప్రకారం, ఆమె కాళ్లు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. మిరాన్ లాంటి 3,700 మందికిపైగా 18 ఏళ్ల లోపు గాజా పిల్లలు ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత గాయపడ్డారని సమాచారం. అదే సమయంలో 1,300 మందికిపైగా పిల్లలు మృతిచెందారు. మొత్తం 20 నెలలుగా సాగుతున్న యుద్ధంలో 17,000 మందికిపైగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇటీవల కాలంలో పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపిన ఘోరమైన యుద్ధం నిలిచింది.
ఆహార కొరత మరింత తీవ్రతరమవుతున్న ఈ సమయంలో, గాజా పిల్లల దుస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది. యూనిసెఫ్ మరియు భాగస్వాములు ఉపయోగించే *ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేస్ క్లాసిఫికేషన్* ప్రకారం, మొత్తం గాజా జనాభా తీవ్ర ఆహార అఘాతాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 5 లక్షల మంది ఆకలితో పోరాడుతున్నారు. సరైన సహాయం అందకపోతే, రాబోయే 10 నెలల్లో 71,000 మందికిపైగా పిల్లలు మరియు 17,000 మంది తల్లులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడతారు. యూనిసెఫ్ మరియు దాని భాగస్వాములు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో సహాయం చేయడానికి యత్నిస్తున్నా, ఇజ్రాయెల్ రెండు నెలలుగా సహాయక వస్తువుల ప్రవేశాన్ని నిరోధించడంతో గాజాలో నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. మేము గాజాకు సురక్షిత, నిరంతరంగా ప్రాప్తి పొందకుండా ఉంటే, మరింత మంది పిల్లలు బాధపడతారు.
ఆహార కొరత మరింత తీవ్రతరమవుతున్న ఈ సమయంలో, గాజా పిల్లల దుస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది. యూనిసెఫ్ మరియు భాగస్వాములు ఉపయోగించే *ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేస్ క్లాసిఫికేషన్* ప్రకారం, మొత్తం గాజా జనాభా తీవ్ర ఆహార అఘాతాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 5 లక్షల మంది ఆకలితో పోరాడుతున్నారు. సరైన సహాయం అందకపోతే, రాబోయే 10 నెలల్లో 71
,000 మందికిపైగా పిల్లలు మరియు 17,000 మంది తల్లులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడతారు.
ఈ మంగళవారం, రాఫాలో వేలాది మంది ప్యాలెస్టినీయులు ఆకలితో కొత్తగా ప్రారంభమైన సహాయక పంపిణీ కోసం దూసుకెళ్లిన దృశ్యాలను ప్రపంచం చూసింది. ఇది ఐక్యరాజ్యసమితిని పక్కనపెట్టి ఇజ్రాయెల్ మద్దతుతో ఏర్పడిన కొత్త ప్రణాళిక. ఈ విధానం, పరిస్థితిని మెరుగుపరిచే బదులు మరింత చెడగొట్టే ప్రమాదం కలిగి ఉంది. యుద్ధ విరామ సమయంలో ఐక్యరాజ్యసమితి 400కు పైగా కేంద్రాల ద్వారా తాగునీరు, పోషకాహారం, వ్యాక్సిన్లు వంటి సహాయాన్ని సరఫరా చేసింది. యూనిసెఫ్ తలపెట్టిన డోర్-టు-డోర్ సేవలు గర్భిణీ మహిళలకు, పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు నేరుగా సహాయం అందించాయి. ఇప్పుడు ఆ వ్యవస్థను పక్కనపెట్టడం వల్ల మాకు కేటాయించబడిన సహాయ కార్యక్రమాలు తీవ్రంగా తగ్గిపోయాయి.
ప్రస్తుతం గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ పేరుతో కొత్త ప్రణాళిక ద్వారా కొన్ని కేంద్రాలకే సరఫరా పరిమితమైంది. అందులో అమెరికన్ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల రక్షణలో ఉండే ప్రదేశాలు మరియు బయట ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. అలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రదేశాలకు ప్రజలు ప్రయాణించాల్సి రావడం వల్ల వారికి ప్రాణాపాయం ఏర్పడుతోంది. ఇజ్రాయెల్ ప్రకారం ఈ కేంద్రాల్లో రోజుకు 60 ట్రక్కులు వొస్తున్నాయి. ఇది యుద్ధ విరామ సమయంలో వొచ్చిన ట్రక్కులలో పది శాతం మాత్రమే . ఇవి *ఫ్యామిలీ బాక్సులు* పేరిట ప్రాథమిక ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. కానీ ఇవి పిల్లల అవసరాలకు సరిపోవు. ఈ విధానం 21 లక్షల జనాభా – అందులో పదిలక్షల పిల్లలు – ఉన్న ప్రాంతానికి సరిపోదు. ఈ కొత్త విధానం మానవతావాద సిద్ధాంతాలకు వ్యతిరేకం. తటస్థత, పాక్షికతలేకపోవడం, స్వతంత్రత వంటి మానవతా నియమాలను ఇది ఉల్లంఘిస్తోంది. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం, యుద్ధంలో ఉన్న పక్షాలు సహాయక వస్తువుల ప్రవేశానికి వీలు కల్పించాల్సిందే.
ఈ కేంద్రాలు సైనిక లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉండటం వల్ల ప్రజలు, సహాయక సంస్థల సిబ్బందిపై దాడుల ప్రమాదం పెరుగుతుంది. ఇజ్రాయెల్, ఈ వ్యవస్థ ద్వారా హమాస్ సహాయం దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటున్నట్లు చెబుతోంది. కానీ ఐక్యరాజ్యసమితి ఇప్పటికే నిర్ధారిత మార్గాల్లో సహాయాన్ని పరిశీలించి, సరైన స్థానాలకు పంపే సామర్థ్యం కలిగిన సంస్థ. మేము అందించే సహాయం రిజిస్ట్రేషన్ స్థలంనుంచి చివరి వ్యక్తికి చేరే వరకు ట్రాక్ చేయవచ్చు.
మా బిడ్డలకు పోషకాహారం, వ్యాక్సిన్లు, మందులు, నీరు నేరుగా అందిస్తాం. మా సహాయం ఎక్కడి నుండి వస్తుందో, ఎవరికీ వెళ్తుందో స్పష్టంగా తెలియజేస్తాం. మాకు కావలసింది ఒక్కటే — మాకు మానవతా సంస్థలుగా పని చేయనివ్వండి. మేము ప్రామాణికంగా, నిష్కర్షగా సహాయం చేస్తాము. మేము అసాధ్యం కోరట్లేదు. మేము కోరేది:
* అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించండి
* ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని సహాయ వ్యవస్థను పునరుద్ధరించండి
* మిగిలిన బంధీలను విడుదల చేయండి
* హమాస్ మరియు ఇజ్రాయెల్ లు ఒక స్థిరమైన కాల్పుల విరమణకు ఒప్పుకోండి
ఈ చర్యలు తీసుకుంటే, మిరాన్ లాంటి పిల్లల జీవితాల్లో వెలుతురు కనిపిస్తుంది. లేదంటే, మానవతా సహాయాన్ని సైనికంగా మలచడం ద్వారా గాజా పిల్లల భవిష్యత్తు మరింత చీకటిలో పడే ప్రమాదం ఉంది.
**– కాథరిన్ రస్సెల్**,
**యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్**
(మునుపు అమెరికా విదేశాంగ శాఖలో గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్‌పై అంబాసిడర్‌గా పనిచేసారు)
న్యూ యార్క్ టైమ్స్ సౌజన్యం తో ..
కాథరిన్ రస్సెల్
యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్