– పంచాయతీ కార్యదర్శి ఉపేష్‌కు జిల్లా కలెక్టర్ సత్కారం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం పరిశీలించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, అవి ఏయే దశలలో ఉన్నాయి, ఎన్ని ఇండ్ల పనులు పూర్తి కావచ్చాయనేది స్వయంగా చూసి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందరూ వేగంగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శిఉపేష్ గ్రామంలోనే ఉండి సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నందున ఆయనను జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





