భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు

రూ.5,000 కోట్ల దందాను పసిగట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టయ్యింది. ఫినటెక్ ముసుగులో రూ.5,000 కోట్ల దందాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయల మళ్లింపు చేస్తున్నట్లు డీజీజీఐ గుర్తించింది. రూ.5 వేల కోట్ల పన్ను ఎగ్గొట్టి దుబాయ్‌కి మళ్లించినట్లు తేలింది. సాంకేతికతను వాడిన హైదరాబాద్ వాసులు బ్యాంకులకే టోకరా వేసి ఓటీపీ లేకుండానే రూ.5 వేల కోట్లు బదలాయింపు జరిపారు. దుబాయ్ కేంద్రంగా ’మాస్టర్ మైండ్‌’ కొనసాగింది. హైదరాబాద్‌లో తీగ లాగితే డొంక కదిలింది. నిబంధనలకు విరుద్ధంగా రియల్ మనీ గేమింగ్.. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు ఎస్క్రో ఖాతాలను వినియోగించినట్లు డీజీజీఐ తెలిపింది. ఓషియానిక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే నకిలీ కంపెనీల ద్వారా నిధుల మళ్లించారు. వెబ్‌సైట్ల ద్వారా అక్రమ దందా సాగింది. బ్యాంకింగ్ వ్యవహారాలను దుర్వినియోగం చేసి ఆడిట్‌కు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు కేటుగాళ్లు. ’విగోఫిన్‌’ డైరెక్టర్లు ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డిలపై అధికారుల నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *