సప్తవర్ణాల సంబురం
సాంస్కృతిక సంకేతం
సమైక్య జీవన సందేశం
ధార్మిక విశ్వాస సంవేధం
రంగుల ‘‘హోలీ’’ఉత్సవం
పాల్గున పౌర్ణమి శుభవేళ
హరివిల్లు ఇలపై విరిసినట్లు
హర్షజల్లు ఎదపై కురిసినట్లు
ప్రకృతి సొంపుతో వన్నెలీనేను
ధరణిధర శోభతో పులకించేను
సప్తవర్నోత్సవ సమయాన
కులమత జాతి వర్ణ తేడాల్లేక
సబ్బండ జనవాలి సమైక్యమై
రంగుల ద్రావణం చల్లుకుంటూ
హర్ష గంగలో తడిసి మురిసేను
ఉల్లాస గగనంలో విహరించేను
వసంతోత్సవ తరుణాన
ఆబాలగోపాలం మమేకమై
చిద్విలాసిస్తూ చిందులేస్తూ
ఉత్సాహ ఊయల్లో ఊగేను
ప్రారవశ్య పల్లకిలో ఊరేగేను
పరమ పవిత్ర సందర్భాన
బంధుమిత్రుల ధరహాసాలు
ఆటపాటలతో కేరింతలతో
ఊరువాడలు మారుమ్రోగేను
పట్టణపల్లెలు కాంతిచిందేను
ఈ రంగుల పర్వదినాన్ని
సకల జనావళి సమైక్యమై
ఉల్లాసబరితమై జరుపుదాం
మన సంస్కృతి ప్రాశస్త్యంను
ప్రపంచమెల్లెడలా చాటుదాం
(హోలీ పర్వదిన శుభాకాంక్షలతో.)
` కోడిగూటి తిరుపతి
:9573929493