“దేవుడు, గురువు, పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది.”
ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు…
భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. దేవుడు, గురువు, పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది.
మాతృదేవోభవ….
పితృదేవోభవ….
ఆచార్య దేవోభవ….
మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో!
రాజకీయాల్లో రాకముందు ముందు, రాధాకృష్ణన్ చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా కుడా పనిచేశాడు. తూర్పు మతాలు, నీతి బోధించడానికి 1936 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆయనకు ప్రతిపాదన వచ్చింది. రాధాకృష్ణన్ ఈ ప్రతిపాదనను అంగీకరించి అక్కడ చాలా సంవత్సరాలు బోధించారు.బోధనతో పాటు, అయన 1946 నుండి 1952 వరకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా కూడా నియమించబడ్డారు. ఆ తరవాత 1952లో అయన భారతదేశపు మొదటి ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. తరువత 1962 లో భారతదేశపు రెండవ రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, రాధాకృష్ణన్ ను విద్యార్థులు సంప్రదించి, అయన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. వారిని అలా అనుమతించకుండా, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని కోరారు.
భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులు…
భారతీయ సమాజం జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అక్షరాలుదిద్దించిన గురువుకే పెద్దపీట వేసింది. ప్రపంచమంతా ఒకే విధంగా గౌరవించే వృత్తి ఉపాధ్యాయ వృత్తి గురువును పూజించే విషయంలో దేశాల మధ్య తేడా ఉండొచ్చుగాని గౌరవించడం అనేది ప్రపంచమంతటా ఒకటే. ఉపాధాయుడ్ని గౌరవించే రూపాలు ఆయా దేశాల్లోని సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది త ప్ప గౌరవించడానికి కొలమానం మాత్రం కాదు. మనసులో గురువు పట్ల ఉండే గౌరవంలో మాత్రం ప్రపంచంలో ఎక్కడ చూచినా ఎటువంటి వ్యత్యాసం కనిపించదు. దీనికి కారణం ఒక వ్యక్తి అభివృద్ధిలో గురువుకు గల కీలకపాత్రపై మనకున్న అపారమైన నమ్మకం. మన గ్రంథాలు అయితే గురువుకిచ్చినంత ఉన్నత స్థానం ప్రపంచంలో ఏ గ్రంథాలు ఇవ్వలేదనే చెప్పాలి.
ఇంతటి ప్రజాదరణ, అపారమైన గౌరవం ఉన్న కారణంగానే ఎంతోమంది ఉపాధ్యాయులు నాయకులయ్యారు. వీరిలో ముఖ్యంగా చెప్పకోవలసిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఈ భారత ఉపఖండానికి మొదటి పౌరుడు కూడా కాగలరని నిరూపించారు., ‘యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే, యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు’ అని కొనియాడారు హోవెల్. ‘నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి’ అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయింది.
గూగుల్ కన్నా ‘గురువే’ గొప్ప…..
నేడు, ప్రపంచం శరవేగంగా దూసుకుపోతోంది, మనకు గూగుల్ అందుబాటులో ఉన్నా సరే మనకు గురువు అవసరం, గురువును గూగుల్ భర్తీ చేయలేదు……
– జాజుల దినేష్, ఎంఏ. బీఈడీ, సెట్, పిజిడిసిఎ.
పొలిటికల్ సైన్స్ లెక్చరర్,నల్గొండ జిల్లా.
9666238266