– మూడో విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ
– వంద రోజుల్లో రూ.6,000 కోట్ల ఉద్యోగుల బకాయిల చెల్లింపులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం మరో రూ. 2 వేల కోట్లను విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రూ.6 వేల కోట్ల బకాయిలను చెల్లించింది.
మూడు విడతల్లో రూ.6,000 కోట్లు
గత మే 29న మొదటి విడతగా రూ.2,000 కోట్లు, జూన్ 30న రెండో విడతగా రూ.2,000 కోట్లు, మూడో విడత మరో రూ.2,000 కోట్లు (గురువారం) విడుదల చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఈ నిధులతో పూర్తిగా చెల్లించింది. రాబోయే రోజుల్లో మిగిలిన ఇతర బకాయిలను కూడా ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధులు విడుదల చేయడంపై లక్షలాదిమంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది హర్షాతిరే కాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న సానుకూల ధోరణి అభినంద నీయమని ఉద్యోగ జేఏసీ నేతలు కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




