ప్రభుత్వ దవఖానలను గాలికొదిలేశారు

– హరీష్‌రావుపై మండిపడ్డ ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌4: పదేళ్లపాటు ప్రభుత్వ దవఖానల ను గాలికి వదిలేసి ఇప్పుడు తమకు పాఠాలు చెబుతున్నారని, ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్‌ ప్రజలు హరీష్‌ రావు, కేటీఆర్‌లను పట్టించుకోరని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. జూబీ ్లహిల్స్‌ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సూపర్‌ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఎందుకు నిర్మించలేదో హరీష్‌ రావు సమాధానం చెప్పాలన్నారు. అధికా రం పోవడానికి ఏడాది ముందు టిమ్స్‌ హాస్పిటల్‌ కోసం టెండర్లు పిలి చారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. కొత్తపేట టిమ్స్‌ హాస్పిటల్‌ నిర్మాణం విషయంలో హరీష్‌ రావు ఆరోప ణలు నిజం కాదని ఆయన తేల్చారు. విదేశాల నుంచి ఆధునిక వైద్య పరి కరాలు రావాల్సి ఉండటంతో కొంత సమయం పడుతోంది. కానీ పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయా లని తమకు ఉద్దేశం లేదు. అత్యాధు నిక ఆపరేషన్‌ థియేటర్లు, సూపర్‌ స్పెషాలిటీ సౌకర్యాలతోనే ప్రజలకు హాస్పిటల్స్‌ అందించబో తున్నాం అని వివరించారు. ఉస్మా నియా వర్షాల్లో మునిగిపోయినా బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు. కానీ సీఎం గోషామహల్‌లో ఆధునిక సౌకలర్యాలతో కొత్త ఉస్మానియా హాస్పి టల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే పను లు మొదలు పెట్టిందని చెప్పారు. అలాగే వరంగల్‌లో ఎంజిఎం హాస్పి టల్‌ నిర్మాణాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలి పారు. త్వరలోనే ఆ ఆస్పత్రిని కూడా ప్రారంభించబోతున్నాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని మొదలుపెట్టింది కాంగ్రెస్‌ పార్టీనే. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్లాది రూపాయలను పేదలకు అందిస్తున్నాం అని గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page