హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు. రూ.105 కోట్ల రుణం తీసుకొని ఎన్సీఎస్ షుగర్ కంపెనీ తిరిగి చెల్లించలేదని సీబీఐ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, విజయనగరం, కాకినాడల్లోని పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. నకిలీ పత్రాలను అసలైనవిగా బ్యాంకుకు సమర్పించి ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు రుణ సదుపాయాలు పొందారని తెలిపారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




