వైభవంగా గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం

పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
సందడి చేసిన సినీ ప్రముఖులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. సినీ ప్రముఖులు బాలకృష్ణ, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, నాగ్‌ అశ్విన్‌, సుకుమార్‌, మణితర్నం, సుహాసిని తదితరులు సందడి చేశారు. పలువురు విజేతలకు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి అవార్డులు అందజేశారు. మెమెంటోతోపాటు రూ.5 లక్షలు, ప్రశంసాపత్రం ఇచ్చారు. కాగా, 2014 నుంచి 2024 వరకు ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగాను మూడు సినిమాల చొప్పున అవార్డులకు ఎంపిక చేశారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ’పుష్ప 2’కుగాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఎన్టీఆర్‌ అవార్డు నందమూరి బాలకృష్ణకు దక్కింది. ఈ విజేతలకు తాజా కార్యక్రమంలో ప్రభుత్వం పురస్కారాలు అందిస్తోంది. అవార్డుతోపాటు కరూ.5 లక్షల నగదు, ప్రశంస పత్రం కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా జ్యూరీ కమిటీని కూడా సత్కరించారు. మురళీమోహన్‌, జయసుధ తదితరులు పురస్కారాలు అందుకున్నారు.

చాలా సంతోషంగా ఉంది : అల్లు అర్జున్‌

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ’ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్‌ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది.. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. గౌరవనీయులైన రేవంత్‌ రెడ్డి అన్నకి, డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ భట్టి విక్రమార్కకి, దిల్‌ రాజుకి థ్యాంక్యూ సో మచ్‌.. డైరెక్టర్‌ సుకుమార్‌ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.. సహ నటీనటులు, టెక్నీషియన్స్‌, ప్రొడ్యూసర్స్‌కు ధన్యవాదాలు.. రాజమౌళి ‘పుష్ప 1’ సినిమాని హిందీలో రిలీజ్‌ చేయమని చెప్పకపోతే ఇదంతా అసలు ఉండేదే కాదు.. ‘పుష్ప 2’ సినిమాకి నేను అందుకున్న ఫస్ట్‌ అవార్డు ఇది. దీన్ని నా ఫ్యాన్స్‌కి డేడికేట్‌ చేస్తున్నా.. జై తెలంగాణ. జై హింద్‌’ అని అన్నారు. కాగా, బన్నీ సీఎం రేవంత్‌ రెడ్డి అనుమతి తీసుకొని పుష్ప 2 సినిమాలోని డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు.

అవార్డులు అందకున్నది వీరే..

’ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : గణ్‌ష్‌ ఆచార్య (దేవర-ఆయుధపూజ)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: చందశ్రేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)
ఉత్తమ హాస్య నటుడు : సత్య, వెన్నెల కిషక్షర్‌ (మత్తు వదలరా 2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : విశ్వనాథ్‌రెడ్డి (గామి)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అధ్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ : నల్ల శ్రీను (రజాకార్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనారావు, అజయ్‌కుమార్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ ఎడిటర్‌ : నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ గేయ రచయిత : చందబ్రోస్‌ (రాజుయాదవ్‌)
ఉత్తమ కథా రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ : అరవింద్‌ మేనన్‌ (గామి)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ క్ష్మ అరుణ్‌ దేవ్‌(35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page