ఇం‌దిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక

•సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు
•ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి
•గ్రేటర్‌ ‌పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడికి హైడ్రా బాధ్యతలు
•గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవా లన్నారు. పెండింగ్‌ ‌బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖని జాభివృద్ధి కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ అనిల్‌, ‌హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికా రులను ఆదేశించారు. అధికారులు ఇసుక రీచ్‌ల వద్ద వెం టనే తనిఖీలు చేపట్టాలని, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇసుక రవాణా పర్య వేక్షణకు ప్రత్యేక అధికారులను నియ మించాలని సూచించారు. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగిం చాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశిం చారు. హైదరాబాద్‌ ‌పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించారు.

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్‌ ‌నిఘా ఏర్పాటు చేయాలని సీఎం ప్రతీ ఇసుక రీచ్‌ ‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్‌ ‌లైట్లు ఏర్పాటు చేయాలని, ఇసుక స్టాక్‌ ‌యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌ ‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్‌ ‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ ‌లారీలను ఎంప్యానెల్‌ ‌చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక బుక్‌ ‌చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని, ఏరియాల వారీగా సమీప ఇసుక రీచ్‌ ‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలని సీఎం చెప్పారు.

వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేయాలని, సమస్య వొచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్‌ ‌సిస్టమ్‌ ‌ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  ఆన్‌ ‌లైన్‌ ‌బుకింగ్‌ ‌విధానంలో పలు మార్పులను సూచించారు. ఆఫీస్‌ ‌టైమింగ్స్ ‌లో బుకింగ్‌ ‌చేసుకునేలా బుకింగ్‌ ‌వేళల్లో మార్పు చేయాలని, అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదని, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని,పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్‌ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page