ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఉచిత సలహాలిచ్చారు

– అవేవీ ప‌ట్టించుకోలేదు : విదేశాంగ మంత్రి జైశంకర్‌ 

న్యూదిల్లీ, జనవరి 7: భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పశ్చిమ దేశాలు ఉచిత స‌ల‌హాలు ఇచ్చాయంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశాలు ఉద్రిక్తతల సమయంలో ఆందోళన చెందినట్లు చెప్పాయని, కానీ అవేవీ తమ సొంత ప్రాంతంలో జరుగుతున్న వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. లక్సెంబర్గ్‌లోని భారత కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాయం చేయాలనుకునే వారితో కలిసి పనిచేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంటుందన్నారు. అదే పాకిస్థాన్‌లా ప్రవర్తిస్తే మాత్రం వాటికి అలాగే సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలు దేనిని ఏమేరకు ప్రభావితం చేస్తాయో చెప్పడం కష్టమన్నారు. ఎక్కడో దూరంగా కూర్చున్నవారు ఉచిత సలహాలు ఇస్తున్నారని, అవి కొన్నిసార్లు స్వార్థంగా, నిర్లక్ష్యంగా ఉంటున్నాయని అన్నారు. ప్రస్తుతం చాలా దేశాలు తమ స్వార్థం కోసం మాత్రమే పని చేస్తున్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page