తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకపక్క సర్దుబాట్లు, మరోపక్క క్షమాపణలు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలోని ఇతర క్యాడర్ విషయం ఎలా ఉన్నా మంత్రులు, ఎంఎల్ఎల మద్యనే పాసగటం లేదు. విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర ముఖ్య మంత్రితోనే నాయకులు విబేధించడం. ఒకరు, ఇద్దరు ఇలా రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరు బయట పడుతు న్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన జీవన్ రెడ్డి. ఏకంగా పార్టీని వీడిపోయిన పరిణామాలతో పార్టీవర్గాల్లో అంతర్మథనం మొదలైంది.
(మండువ రవీంర్రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకపక్క సర్దుబాట్లు, మరోపక్క క్షమాపణలు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలోని ఇతర క్యాడర్ విషయం ఎలా ఉన్నా మంత్రులు, ఎంఎల్ఎల మద్యనే పొసగటం లేదు. విచిత్రకర విషయమేమంటే ముఖ్య మంత్రితోనే నాయకులు విబేధించడం. ఒకరు, ఇద్దరు ఇలా.. రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరు బయట పడుతున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన జీవన్రెడ్డి ఏకంగా పార్టీని వీడిపోయిన పరిణామాలతో పార్టీ వర్గాల్లో అంతర్మథనం మొదలైంది. ముఖ్యంగా వలస నేతలకు, దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్నవారి మధ్య అఘాతం పెరుగుతున్నది. పార్టీలోని సీనియర్స్ కు ప్రాధాన్యం లేకుండా పోతోందన్న అభిప్రాయాలు తరుచు వ్యక్తమవుతున్నాయి. జీవన్రెడ్డి బాటలో ఇప్పుడు చిన్నారెడ్డి పయనిస్తాడా అన్న అనుమానాలకు తావేర్పడుతున్నది. వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ ఆయన ఆవేదనతో రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టినా ఆయన ఇంకా మనస్తాపంతో కొనసాగుతున్నారనడానికి తాజాగా ఆయన చేసిన కామెంట్ పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. స్థానిక ఎంఎల్ఎ మేఘారెడ్డికి డబ్బులు తీసుకుని పార్టీ టికట్ ఇచ్చారన్న ఆయన తాజా ఆరోపణపై అధిష్టానంకూడా. సీరియస్ అయింది. మరోపక్క మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నేరుగా ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. చాలాకాలంగా కొండా కుటుంబానికి పార్టీలోని ఇతర నేతలకు మధ్యన పొసగటంలేదు. గతంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్యేలు సంఘటితంగా మంత్రి సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ చల్లారినట్లు కనిపించినా దాని పరిణామాలు నాయకులను వెంటాడుతూనే ఉన్నాయి. మేడారం టెండర్లకు సంబందించి కొండా దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మధ్య జరిగిన వివాదం, కొండా సురేఖ ఓఎస్టిని డిస్మిస్ చేయడం, ఆమె భద్రతను తగ్గించడం లాంటి సంఘటనలు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపాయి. చివరగా సురేఖ సిఎంను కలిసి క్షమాపణ చెప్పడంతో ఆ ఎపిసోడ్ కు తాత్కాలికంగా తెరపడింది. అలాగే తోటి మంత్రులపై ఆమె చేసిన ఆరోపణ కూడా పెద్ద వివాదానికి దారితీసింది. మంత్రులు ఫైల్ క్లియర్ చేసేందుకు డబ్బులు తీసుకుంటారని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రివర్గాన్ని ఇబ్బంది పెట్టాయి. తన దగ్గరకు వచ్చిన ఫైల్స్ విషయంలో ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే తాను ఫైల్స్ క్లియర్ చేస్తున్నానని తనకు తాను కితాబిచ్చుకున్న సురేఖ స్టేషన్ ఘనపూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరితో మరో వివాదానికి తెరతీశారు. శ్రీహరితోపాటు పలువురు తన ప్రమేయం లేకుండా తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆమె ఆరోపించడమేకాక ఈ విషయాన్ని రాష్ట్రంతోపాటు కేంద్ర నాయకత్వానికి కూడా తెలపడంతో కేంద్ర నాయకత్వం దీనిపై విచారణ చేయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇది కొనసాగుతుండగానే తాజాగా సీఎం పరకాల పర్యటన సందర్భంగా ఆమె గైర్హాజరు కావడం మరొకసారి రాజకీయ చర్చకు దారితీసింది. దానిపై చర్చ జరుగుతుండగానే ఆమె కూతురు సుస్మితపటేల్ ముఖ్యమంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేయడం ఒకదాని వెనుక ఒకటి జరిగిపోయాయి. ఈ విషయాన్నికూడా అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. సురేఖతోపాటు తోటి ఎంఎల్యేపైన తీవ్ర ఆరోపణ చేసిన డాక్టర్ చిన్నారెడ్డికి అధిష్టానం నోటీసులు జారీ చేసింది. వారి వివాదగ్రస్త ఆరోపణలకు సంబందించి మూడు రోజుల్లో వివరణ ఇచ్చుకోవాల్సిందిగా ఆదేశిస్తూ నోటీస్ నిచ్చారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య కూడా ఇలాంటి వివాదాలే కొనసాగాయి. చివరకు పొన్నం క్షమాపణతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





