జూబ్లీహిల్స్ ‌రహమత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

– మూడు కార్లు, ఒక ఆటో దగ్ధం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ‌జూబ్లీహిల్స్ ‌రహమత్‌నగర్‌ ఎస్పీఆర్‌ ‌హిల్స్ ‌గ్రౌండ్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. వీటితో పాటు సమీపంలో పార్కింగ్‌ ‌చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడ్డాయి. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి ఫైర్‌ ‌సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను సంఘటనా స్థలం నుంచి దూరంగా పంపించివేసారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గంజాయి మత్తులో ఓ వ్యక్తి చెత్తకు నిప్పు అంటించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని ఇళ్ల వారు ఈ గ్రౌండ్‌లో కార్లు పార్కింగ్‌ ‌చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? దురుద్దేశంతో చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఆర్‌ ‌నగర్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్‌స్పెక్టర్‌ ‌సురేందర్‌ ‌పరిశీలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page