‘‘సంఘ్ పరివార్ శక్తులు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా పెట్రేగిపోతున్నారు. ఈ దేశంలో విభిన్న రకాలైన కులాలు భిన్న రకాలైన మతాలు అనేక రకాల జాతులు భిన్నమైనటువంటి సంస్కృతి అనాదిగా కొనసాగుతుందన్న ఆలోచన కూడా వారి బుర్రలో లేకుండా పోయింది. ఒక దేశం ఒక మతం అనే ఆలోచనలను ఇనుమడింప చేసుకొని అన్య మతస్థుల పై,ముఖ్యంగా మైనారిటీ ల పై దాడులకు తెగబడుతున్నారు. భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచన కులుబుర్గి, గౌరి లంకేశ్, స్వామి లాంటి రచయితలను, మేధావులను భౌతికంగా అంతం చేశారు. భావపరమైనటువంటి సంఘర్షణకు తావు లేకుండా భౌతిక పరమైనటువంటి దాడుల ద్వారానే మతోన్మాద దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి అనేక కుటిల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ’’
దేశంలో మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించి రచయితలను టార్గెట్ గా చేసుకొని దాడులకు బరితెగిస్తున్నారు.ఇదే విధమైన నమునాను డిసెంబర్ 29న హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బుక్ పెయిర్ లో వీక్షణం స్టాల్ వద్ద ఒక మతోన్మాది నానా బీభత్సం సృష్టించాడు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు తెలంగాణ ప్రాంత పౌర సమాజాన్నే కాకుండా ఈ దేశ లౌకిక శక్తులు అందరిని కూడా తట్టి లేపింది.అతడు స్పందించిన వ్యక్తపరిచిన విధానాన్ని చూస్తే పక్కా ప్రణాళికతో ఆ స్టాల్ వద్దకు వొచ్చినట్లు స్పష్టంగా కనపడుతుంది. నిజ జీవితంలో పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎవ్వరు కూడా పుస్తకాల పట్ల, పుస్తక దుకాణాల వద్ద ఆ విధంగా వ్యవహరించరు. ఫలానా పుస్తకం ఎందుకు అమ్ముతున్నావు అనేటువంటి ప్రశ్న మతోన్మాదుల అనాగరికమైన ఆలోచనలకు నిదర్శనం.ఆ పుస్తకం రాసిన రచయిత ఎవరు.? ఎన్ని సంవత్సరాల క్రితం వ్రాశాడు.? ఆ పుస్తకంలో ఉన్నటువంటి భావజాలం ఏమిటో.! కనీసం చదువకుండా ఆ పుస్తకం టైటిల్ కూడా అర్థం చేసుకోకుండా అతడు ఎగిరి దునికిన విధానం మూర?త్వానికి నిదర్శనం.
ఆ పుస్తకం పట్ల అతనికి భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే ఆ పుస్తకాన్ని చదివి విమర్శనాత్మకంగా మరో పుస్తకాన్ని సమాజం ముందు ఉంచాలి.సోయి ఉంటే చర్చావేదికలు పెట్టుకొని ఏ పేజీలో ఏమి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయే, ప్రత్యామ్నాయం ఏమిటో నిరూపించాలి.లేదా దేశంలో ప్రజలందరి భావాలను స్వేచ్ఛను స్వాతంత్రాలను గౌరవించే న్యాయ వ్యవస్థ ఉంది అ పుస్తకం ఏ విధంగా అభ్యంతరకరమో ఆ న్యాయస్థానం దృష్టికైనా తీసుకెళ్లాలి.ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతి. కానీ అలా కాకుండా బుక్ స్టాల్ నిర్వాహకులపై దుర్భాషలాడుతూ వారి నుంచి వొచ్చే ఏదో ఒక పదాన్ని పట్టుకొని హింసను ప్రేరేపిద్దామనే ఆలోచన విధానం మతోన్మాద ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తుంది.
సంఘ్ పరివార్ శక్తులు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా పెట్రేగిపోతున్నారు. ఈ దేశంలో విభిన్న రకాలైన కులాలు భిన్న రకాలైన మతాలు అనేక రకాల జాతులు భిన్నమైనటువంటి సంస్కృతి అనాదిగా కొనసా గుతుందన్న ఆలోచన కూడా వారి బుర్రలో లేకుండా పోయింది. ఒక దేశం ఒక మతం అనే ఆలోచనలను ఇనుమడింప చేసుకొని అన్య మతస్థుల పై,ముఖ్యంగా మైనారిటీ ల పై దాడులకు తెగబడుతున్నారు. భిన్నమైన టువ ంటి అభిప్రాయాలను వ్యక్తపరిచన కులుబుర్గి, గౌరి లంకేశ్, స్వామి లాంటి రచయితలను, మేధావులను భౌతికంగా అంతం చేశారు. భావపరమైనటువంటి సంఘర్షణకు తావు లేకుండా భౌతిక పరమైనటువంటి దాడుల ద్వారానే మతోన్మాద దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి అనేక కుటిల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే వీక్షణం వేణుగోపాల్ పై దాడి జరిగినట్లుగా పౌర సమాజ సంస్థలు, లౌకిక శక్తులు, అభ్యుదయవాదులు భావిస్తున్నారు. ఇలాంటి దాడులకు అడ్డు కట్ట వేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మౌనం వహిస్తుంది.
గతంలో వరంగల్ కేంద్రంగా సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం నిర్వహించిన సదస్సులో కూడా సంఘపరివార్ శక్తులు భౌతిక దాడులకు తెగబడ్డాయి.ఆనాడు ముక్తకంఠంతో పౌర సమాజ సంస్థలన్ని కూడా పెద్ద ఎత్తున స్పందించిన క్రమంలో ముఖ్యమంత్రి పరోక్షంగా స్పందించి వదిలిపెట్టారు.రాజ్యాంగం నిర్దేశించిన కోణంలో మత కార్యకలాపాలు కొనసాగించుకోమని చెపుతున్న పోలీసులపైన, ఉపాధ్యాయుల పైన,వికృతమైన పోకడలతో దాడులు చేస్తున్న తీరును తెలంగాణ లో ఈ మధ్యకాలంలో చూశాం.,ప్రజాస్వామిక శక్తులు విసిరే ప్రశ్నలకు సమాధానం లేకనే మతోన్మాద శక్తులు ఈ ఉన్మాదపు దాడులకు పాల్పడుతున్నారనేది స్పష్టం అవుతుంది. అక్షరం పై అవగాహన ఉంటే అక్షరాలతోనే రుజువు చేయాలి.కాని పుస్తకాలు చదువని అజ్జానులు పరుష పదజాలంతో వాట్సాప్ యూనివర్సిటీలలో విశృంకలాలకు తెగబడుతున్నారు.
మత ఉన్మాద ఆగడాలకు ఇప్పటికే ఉత్తర భారత దేశంలో అడ్డు అదుపు లేకుండా పోయింది. దేశంలో ప్రధాన యూనివర్సిటీల బయట,లోపల ఇలాంటి దాడుల వాతావరణమే కొనసాగుతుంది.అటువంటి తంతును దక్షిణ భారతదేశంలో కొనసాగించి తిష్ఠ వేయాలనే పక్కా వ్యూహంతో మతాన్ని సాకుగా తీసుకొని అలజడులను అల్లరులను సృష్టిస్తున్నారు.అనాదిగా మతపరమైన అలజడులకు తెలంగాణలో తావులేదు.కానీ ఆ వైపుగా ప్రేరేపించబడుతున్నాయి.ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాలలో తీవ్రమైన బూతు పదజాలంతో రచయితలు, మేధావులు చేస్తున్న రచనల పై విరుచుకుపడుతున్నారు. దాడులు చేస్తామని, చంపేస్తామని, ఇంటి మీద దాడులు చేసి మీ పిల్లలను ఎత్తుకెళతామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
పుస్తక రచయితలకు ఫోన్లు చేసి రచనలు మానుకోకపోతే చంపేస్తున్నామని బెదిరిస్తున్నారు. తెలంగాణలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనల పట్ల పాలనా యంత్రాంగం వ్యవహరించిన తీరు పట్టి పట్టనట్లుగా కనపడుతుంది. పాలక ప్రభుత్వాలు ఘటనలు జరిగిన వెను వెంటనే స్పందించకపోవడంతో ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనల పట్ల పాలకులు అప్రమత్తంగా ఉండకపోతే చిలికి చిలికి గాలి వాన ఐ పెను దుమారం సృష్టించే ప్రమాదం లేకపోలేదు. మతతత్వ శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మానవతావాదం కంటే మతతత్వవాదం గొప్పది కాదని సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. లేనట్లయితే భవిష్యత్ లో కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించి తెలంగాణ లో లబ్ధి పొందాలనే ఆలోచన చేసే ప్రమాదం లేకపోలేదు.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192