- సమాచారం గోప్యంగా ఉంటుంది : మంత్రి పొన్నం ప్రభాకర్
- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్,14 :సమగ్ర ఇంటి ంటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హై• •రాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్,హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసిబంజారాహిల్స్ ఎన్.బి. టినగర్‌లోని రోషన్ బాగ్ కాలనీ అపార్ట్మెం ట్స్, నాజర్ మిథాలీ నగర్‌లో ఇంటింటి కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునేందుకు,భవిష్య ప్రభుత్వ ప్రణా ళిక ద్వారా మంచి మార్పు తీసుకు వచ్చే దిశగా, ప్రజలను భాగస్వాములను చేసు కుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తో తెలం గాణ రాష్ట్రందేశానికి దిక్సూచిగా ఉంటుం దన్నారు. తెలంగాణ సమాజంలో గొప్ప మార్పు రావడానికి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 6 నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమం, 9 నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమై ంద న్నారు.
రాష్ట్రంలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తు న్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే పూర్తయిందని, జిహెచ్‌ఎంసి పరిధిలో 4.44 లక్షలకు పైగా ఇళ్ల సర్వే పూర్తయి ందని మంత్రి తెలిపారు. సర్వే పై ప్రజలు సానుకూలంగా స్పంది స్తున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దని, సమాచారం గోప్యంగా ఉంటుందని, సర్వేతో ఎవరికీ కూడా ప్రభు త్వ పథకాలు కట్ కావని స్పష్టం చేసారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మార్గదర్శకంగా తీసుకుం టుంద న్నారు. గతంలో సర్వే చేయాలని దీక్షలు, ధర్నాలకు దిగిన వారం దరూ సైలెంట్ గా ఉన్నారని, అన్ని కుల సంఘాలు, సర్వేను అందరూ స్వాగతి స్తున్నారని పేర్కొన్నారు. దేశంలో బీహార్, మహారాష్ట్రలో సర్వే చేసినప్పటికీ తెలంగాణ లో జరిగే సర్వే దేశానికి దిక్సూచిగా ఉంటు ందని అన్నారు. సర్వేతో జరిగే మార్పు స్పష్టంగా కనబడుతదని అన్నారు. సమా చారం వచ్చాక ప్రాపర్‌గా అనాలసిస్ చేసుకుని ఒక దిశా నిర్దేశం చేసుకునే విధ ంగా సర్వే జరుగుతుందన్నారు.
ఏవర్గా లకు న్యాయం జరగలేదో ఆయా వర్గాలకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్ ప్రణాళిక రూపొందిం చనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జరగని సర్వే తెలంగాణలో జరుగుతు న్నదని, అన్ని కుల సంఘాల ప్రతినిధులు తమ కులస్తులను చైతన్య పరిచి సరైన సమాచారం ఇచ్చేలా ప్రోత్సహించాలని కుల సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, బ్యాంక్ ఖాతాకి ఆప్షన్ అడుగుతు న్నారని, బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగడం లేదని, అకౌంట్ ఉన్నదా లేదా అన్న సమాచారం మాత్రమే అడుగుతు న్నట్లు చెప్పారు. ఎవరికేని ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్లు, స్పెషల్ నోడల్ పర్యవేక్షణ అధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. సర్వే చేసే వారెవరు ప్రైవేటు వ్యక్తులు కాదని, ప్రభుత్వం నియమించిన ఉద్యోగు లని, ఐడెంటి కార్డు కూడా ఉందని, ప్రభు త్వ ఆదేశాల మేరకు వారు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు. అనవసర రాద్ధాంతం చేయకుండా, ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కల్పించకుండా సర్వే నిరాటం కంగా జరిగేలా సహకరించాలని ప్రతి పక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
బంజారాహిల్స్ ఎన్.బి.టి నగర్ రేషన్ బాగ్‌లో అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న నాజర్ కుటుంబానికి సంబంధించిన వివరాల నమోదు తీరును మంత్రి పరిశీలించారు. మిథాలీ నగర్ లో సురేష్ రెడ్డి కి సంబంధిం చిన కుటుంబ సర్వేను పరిశీలించి, సర్వే పై కుటుంబ సభ్యులకు ఉన్న సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. బ్యాంక్ అకౌంటు ఎందుకు అడుగుతు న్నారని సురేష్ రెడ్డి అడుగగా, సర్వే ఫారంలో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అన్న ప్రశ్న ఉందని, అకౌంట్ ఉంటే ఉం దని లేకుంటే లేదని సమాచారం ఇవ్వాలని మంత్రి వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిహెచ్ ఎంసి అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డి సి ప్రశాంతి, ఖైరతాబాద్ జోన్ నోడల్ అది •కారి శరత్ చంద్ర, సూపర్వైజర్ అధికారి శివాజీ, ఎన్యుమరేటర్లు మానస, సంధ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.