యాప్‌ ఆధారిత డిపాజిట్లతో రూ.850 కోట్ల మోసం

– ఫాల్కన్‌ ఎం‌డీ అమర్‌దీప్‌ అరెస్ట్

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: ఫాల్కన్‌ ఎం‌డీ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ముంబయిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమర్‌దీప్‌పై లుకౌట్‌ ‌నోటీసులు  జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ‌నుంచి ఆయన ముంబయికి చేరుకోవడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిజిటల్‌ ‌డిపాజిట్ల పేరిట అమర్‌దీప్‌ ‌రూ.850 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. యాప్‌ ఆధారిత డిపాజిట్లతో ఫాల్కన్‌ ‌సంస్థ భారీ కుంభకోణానికి తెరతీసింది. షేర్‌ ‌మార్కెట్‌ ‌పెట్టుబడుల పేరుతో ప్రజలను అమర్‌ ‌మభ్యపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కామ్‌ ‌వెలుగులోకి రాగానే అమర్‌దీప్‌ ‌దంపతులు దుబాయ్‌కి పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈవో, అమర్‌దీప్‌ ‌సోదరుడిని అధికారులు అరెస్ట్ ‌చేశారు. ఫాల్కన్‌ ఇన్‌వాయిస్‌ ‌డిస్కౌంటింగ్‌ ‌పేరిట భారీ పెట్టుబడి మోసానికి పాల్పడినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌, ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా మోసాలు చేశారని.. ప్రముఖ ఎంఎన్‌సీల పేర్లతో ఫేక్‌ ఇన్‌వాయిస్‌ ఒప్పందాలు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. దాదాపు 7,056 మంది డిపాజిటర్లు.. అందులో 4,065 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ పెట్టుబడి వచ్చేలా బాధితులను ఆకర్షించారన్నారు. ఇప్పటి వరకు 11 మంది నిందితులను అరెస్ట్ ‌చేశామని.. వీరిలో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్‌లు ఉన్నారని తెలిపారు. 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, నగదు, బంగారం, షేర్లను సీజ్‌ ‌చేసినట్లు వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page