కేయూ బీఈడీ మూడో సెమిస్ట‌ర్ ప్రాక్టిక‌ల్స్ వాయిదా

‍‍- ప్రజాతంత్ర వార్తకు స్పందన

కాళోజీ జంక్షన్/ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ప‌డ్డాయి. ఒకవైపు తెలంగాణ టెట్, మరోవైపు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు బీఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు అవరోధంగా మారడంతో విద్యార్థుల ఆందోళ‌న‌ను, మాన‌సిక వేద‌న‌ను యూనివ‌ర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ‘ప్ర‌జాతంత్ర’ ఆదివారం వార్త ప్ర‌చురించింది. ఈ వార్త‌కు స్పందించి విద్యార్థుల ఆందోళన గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, విద్యా విభాగం ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాసరావులు బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లుప్రకటించారు. పరీక్షల నిర్వహణ టైం టేబుల్ ను తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. విశ్వవిద్యాలయం అధికారుల నిర్ణయం పట్ల బీఈడీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page