ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి : కెసిఆర్

వరంగల్, ప్రజాాతంత్ర, ఏప్రిల్ 27:  మావోయిస్టుల అణ‌చివేత కోసం కేంద్రం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్ ను వెంట‌నే నిలిపివేయాల‌ని బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (KCR) డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో జ‌రిగిన పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.

ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఛత్తీస్గఢ్ గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారు. చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారు. వాళ్ల విజ్ఞప్తి మేరకు నక్సలైట్లను చర్చలకు పిలవాలి. బలగాలు ఉన్నాయని అందర్నీ చంపుతూ వెళ్తే.. ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయండి. ఆపరేషన్ కగార్ ఆపాలని తీర్మానం చేసి దిల్లీకి లేఖ‌ పంపుదాం” అని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *