ఒక మహిళతో పాటు ఒకరు ఎల్‌ఓఎస్ కమాండర్ మృతి
భద్రాచలం,ప్రజాతంత్ర,మే 08 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో సుకుమార్ జిల్లాలో సోమవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఒకరు ఎల్‌ఓఎస్ కమాండర్‌గా గుర్తించారు. మడకం ఎర్ర అనే పేరు కలిగి ఉన్నారు. ఇతనిపై ఛత్తీస్‌ఘఢ్ ప్రభుత్వం 8 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే సుకుమా జిల్లా దంతేస్‌పురం అడవుల్లో మావోయిస్టు లతో పాటు మడకం ఎర్ర ఉన్నాడనే పక్కా సమాచారంతో కోబ్రా 202 బెటాలియన్ సిఆర్‌పిఎఫ్ 219 బెటాలియన్ ఇతర భద్రత బలగాలతో పాటు సుకుమార్‌కు చెందిన డిఆర్‌జి బృందాలు మావోయిస్టులను వెతికేందుకు దంతెపురంకు వెళ్ళి తిరిగొస్తున్న క్రమంలో మావోయిస్టులు పోలీస్ బలగాలపై దాడికి పాల్పడటంతో డిఆర్‌జి బలగాలు కూడ ఎదురుకాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎల్‌ఓఎస్ కమాండర్ మడకం ఎర్రాతో పాటు ఎల్‌ఓస్ సభ్యులు పొడియం భీమే మృతి చెందినట్లు పోలీస్ బలగాలు గుర్తించాయి. వీరి వద్ద నుండి ఆయుదాలు, మందుగుండు సామాగ్రి, ఇతర సామాగ్రిని పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను సుకుమార్‌కు పంపించినట్లు తెలుస్తుంది.