రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు, కే.విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, కె.రాంనారాయణ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఐజేయు, కె. సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఐజేయు, కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, కె. శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, యం. వెంకట్ రెడ్డి, కోశాధికారి, టీయుడబ్ల్యూజే, ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, టీయుడబ్ల్యూజే, హెచ్.యూ.జే. అధ్యక్షులు, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గురువారం గృహ నిర్మాణ, సమాచార, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు మంత్రిగారికి శుభాకాంక్షలను తెలిపారు. కా కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ.జి. జ్యోతి బుద్ధప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ విపి. గౌతమ్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.హరీష్ తదితర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.