– డీటీఎఫ్ హనుమకొండ శాఖ పిలుపు
హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: డీటీిఎఫ్ సీనియర్ కార్యకర్త, జిల్లా కౌన్సిలర్ ఏలూరి సత్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో విద్యా సదస్సు- అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యారంగం-ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై అధ్యాపక జ్వాల సంపాదకురాలు జి.కళావతి, విద్యారంగం -మహిళలు అనే అంశంపై డీటీఎఫ్ నాయకురాలు ఎస్.అనిత ప్రసంగిస్తారని జిల్లా శాఖ అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అభినందన సభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నిర్వహించే అభినందన సభలో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, డీటీిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కమలాపూర్ మండల నిర్మాణ బాధ్యులు బి.అంజనీదేవి, రాష్ట్ర కౌన్సిలర్ డి.రమేష్, ఎ.సంజీవరెడ్డి, కమలాపూర్ మండల అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు టి.శ్రీనాథ్, ఎం.సువర్ణ తదితరులు ప్రసంగిస్తారని ఉప్పలయ్య, శ్రీనివాస్‌లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





