ప్రతీ ఆరు నెలలకో కొత్త హాస్పిటల్

– అత్యంత ప్రాధాన్యతాంశాలుగా విద్య, వైద్యం
– 2027 డిసెంబర్ నాటికి అన్ని దవాఖానలు సిద్ధం
– బీఆర్ఎస్ నేతలు టిమ్స్ కు కొబ్బరికాయ కొట్టి మరిచిపోయారు
– మీరే కడితే మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు
* సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : బీఆర్ఎస్ నాయకులు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ కు కేవలం కొబ్బరికాయ కొట్టి మరిచిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాతనే హైదరాబాద్లోని మూడు టిమ్స్ హాస్పిటల్ ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేశామని వెల్లడించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ ను టిమ్స్ వద్దకు తీసుకు వచ్చి ఇదంతా మేమే కట్టాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. వరంగల్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని, 2027 డిసెంబర్ నాటికి అన్ని ప్రధాన హాస్పిటల్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పేదల ఆరోగ్య పరిరక్షణను తమ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, రాష్ట్ర‌ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా లభించే అవకాశాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
కార్పొరేట్ కు దీటుగా..
కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. 1100 బెడ్లు, 300 ఐసీయూలతో, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యంతో ప్రజలకు వైద్య సేవలను అందించబోతోంది. దేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రిలో ఎక్కడికైనా 2 నిమిషాల్లోనే శాంపిల్స్, రిపోర్ట్స్, మందులు, పరికరాలు చేరవేసే సదుపాయం ఉంది. 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో నాలుగు ప్రధాన బ్లాకులుగా క్లాసిక్ ఆర్కిటెక్చర్తో ఈ హాస్పిటల్ను నిర్మించారు. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ, మరో 5 స్పెషల్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. బ్లాక్ -ఏలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. బ్లాక్-బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్్యబ్లు ఉన్నాయి. బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్లతోపాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్ దీని అడ్మిని స్ట్రేషన్, అకడమిక్ విభాగాలతో పాటు 200 మంది కూర్చునే ఆడిటోరి యంతో తీర్చిదిద్దారు.
ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టంతో శాంపిల్స్
దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా బ్లడ్ శాంపిల్స్, మందులు, రిపోర్టులు, ఎమర్జెన్సీ వస్తువులను వార్డులు, ఐసీయూ, ల్యాబ్లు, బ్లడ్ బ్యాంక్ల మధ్య కేవలం 1 నుంచి 2 నిమిషాల్లోనే చేరవేయవచ్చు. రోగ నిర్ధారణ కోసం 3.0 టెస్లా ఎంఆర, 128-స్లెస్ సీటీ స్కానర్, అడ్వాన్స్డ్ మామోగ్రఫీ, 5 ఎక్స్రే యూనిట్లను సమకూర్చారు. రోగుల సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో 200 మంది సామర్థ్యంతో ధర్మశాల నిర్మించారు. 30 డెడాబాడీల సామర్థ్యంతో మార్చురీ, సెంట్రల్ కిచెన్, లాండ్రీ, మెడికల్ ఆక్సిజన్ పైపల లైన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పర్యావరణ అనుకూలంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు 75 శాతం నీటిని ఆదా చేస్తూ ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ను దక్కించుకుంది.మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి టిమ్స్‌లో వివిధ బ్లాకులను, రిసెప్షన్‌లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరును పరిశీలించారు. ఓపీ నమోదు కౌంటర్, పోస్ట్ ఆపరేషన్ వార్డు, ట్రామా విభాగం, ఆపరేషన్ థియేటర్స్, ఇతర విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో వైద్య విప్లవం : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సనత్ నగర్ వద్ద 53 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1,000 పడకల పైగా సామర్థ్యంతో నిర్మించిన టిమ్స్ హాస్పి టల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరుతో ప్రారం భించి ప్రజలకు అంకితం చేయడం గొప్ప కార్య క్రమమని ఆయన పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ కేవలం ఒక భవనం కాదని, భవిష్యత్తులో లక్షలా ది మంది తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే ఆధునిక వైద్య దేవాలయంగా నిలు స్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభు త్వం 2023లో ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానలు, వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి రూ.8,922 కోట్లు ఖర్చు చేసి, నిధులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సనత్ నగర్ టీమ్స్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, ఇతర
ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు మాత్రమే రెండున్నరేళ్లలో రూ.3,880 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. టిమ్స్ సనత్నగర్, టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్బీనగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులను వేగవంతం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇవికాక మరో 193 ఆరోగ్య ప్రాజెక్టులకు రూ.3,953 కోట్లు విడుదల చేసినట్లు భట్టి చెప్పారు. ఆస్పత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందు కు అక్టోబర్ నుంచి జూలై వరకు ప్రత్యేకంగా రూ.1,452 కోట్ల యాక్సిలరేటెడ్ పేమెంట్స్ చేసినట్లు వెల్లడించారు. అదనంగా సబ్ సెంటర్ల నిర్మాణానికి మరో రూ.331 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టిమ్స్ సనత్ నగర్ నిర్మాణానికి కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మొత్తం నిర్మాణాన్ని తామే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ఈ లెక్కలన్ని చెప్పానని ఆయన వివరించారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాల్లో 1.06 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి రూ.10 లక్ష ల వరకు వైద్య సాయం అందించే రాజీవ్ ఆరో గ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వైద్య మౌలిక వసతులు, ఆస్పత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరి కరాల సమకూర్పుపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించిందన్నారు. ఈ ఏడాది అనేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు భవనాలను పూర్తి చేసి వేలాది పడకలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు పేదలకు ఆధునిక దేవాలయాల్లా ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి రాజనర్సింహ ప్రత్యేక చొరవతో రాష్ట్ర వైద్యరంగంలో పెద్దఎత్తున మార్పులు తీసు న్న కొస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *