అజో-విభొ-కందాళం, సహృదయ సంస్థల అధ్వర్యంలో విశిష్ట పురస్కారాలు

– మండువ రవీందర్రావు

హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ తమ 33వ వార్షికోత్సవాన్ని, ప్రముఖ సాహిత్య సంస్థ అజో-విభో-కందాళం సంస్థతో కలిసి జనవరి ఒకటి నుండి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటిక పోటీలతోపాటు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందజే యనున్నారు. కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే ఉదయం సభలను హనుమకొండ న్యూ బస్ స్టాండ్ సర్కిల్లోని శ్రీహర్ష కన్వెన్షన్ హాల్ , సాయంత్రం కార్యక్రమాలు కాళోజీ కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, పలు విజ్ఞానస ర్వస్వాల గ్రంథకర్త డాక్టర్ గుంజి వెంకటరత్నంకు ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదును అజో-విభో-కందాళం ఫౌండేషన్ అందించ నున్నది. అలాగే విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారంతోపాటు రూ. 50వేల నగదును వరంగల్కి చెందిన ప్రముఖ రచయిత రామా చంద్రమౌళికి ఆందజేయనున్నారు. వీరితోపాటు మరికొందరికి పదివేల రూపాయాలతోపాటు రంగస్థల సేవామూర్తి పురస్కారాలు అందజే యనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page